విజయునికి, ప్రశక్తి = అధికబలమును, నిర్వహించుచు, శుభపదమై, వికలంక = నిష్కళంకమైన, అధిరాజ్యవిలాస = సామ్రాజ్యవిలాసమందుఁగల, పట్టాభిషేకమును, స్వపుర = తనపట్టణమందు అనఁగా హస్తినగరమందు, స్ఫూర్జితముగ నడపఁగా, అప్పుడు, తాన్ = తాను, నవప్రభుత్వమందుఁగల, విశేష = వింతరీతిచేత, పృథుతరమైనదీప్తిచేత, విభీషణుండు = భయంకరమైనవాఁడు - చూడ శక్యముగానివాఁ డనుట. ధర్మరాజు, ఇతరక్షమాపాల = తక్కినరాజులకు, దుర్లభతరమైన భాగ్యలక్ష్మిచేతఁ దేజరిల్లెను.
రామ. క్రీడానరుండయిన శ్రీవరుండు = రఘునాథుఁడు, క్షాత్ర = క్షత్త్రియసంబంధమైన, ప్రక్రియను = వర్తనచేత, విజయమందుఁగల, ప్రశక్తి = అధికసామర్థ్యమును, నిర్వహించుచు, తనకున్ = విభీషణున కనుట. శుభపదవిక = శుభమైనమార్గము గల లంకాధిరాజ్యపట్టాభిషేకము, స్వ = తనకు, పురః = ముందరికిని - ఎప్పటికిని ననుట. స్ఫూర్జితముగ నప్పుడు దానవప్రభుత్వవిశేషముచేతఁ బృథుతరదీప్తి గలవాఁడు, ధర్మ = సకలధర్మములచేతను, రాజిత = ఒప్పుచున్న, రక్షన్ = సంరక్షణచేత, మాపాలన్ = మాయందు, దుర్లభతరభాగ్యలక్ష్మి నేఁడుగా ఫలించెననుట. అస్మత్పూర్వకృతము = పూర్వపుణ్యము, అద్భుత మని సుజను లలరఁ దేజరిల్లెను.
| తే. | విష్ణుముఖ్యావతారమై వెలయువిశ్వ | 256 |
రామ. విశ్వవిభుఁడు = రఘునాథుఁడు, అనల = అగ్నియందు, సహర్ష = హర్షసహితమైన, ప్రవేశముచేతనైన, మహిమకతనన్ = మహిమవల్ల, తనచెల్వ = సీతాదేవియొక్క, మతిశుద్ధి గాంచి = హృదయశుద్ధిని గాంచి, అమరవినుతి = బ్రహ్మాదిదేవతాస్తోత్రము, మిగులఁ జేకొని, తనదుపురికిన్ = అయోధ్యానగరమునకు, ఏగెను. సీతాసమేతుఁడయి పుష్పకారూఢుఁడయి లక్ష్మణవిభీషణసుగ్రీవాదిసమేతుఁడయి వచ్చి ప్రవేశించెను.
భారత. విశ్వవిభుఁడు = శ్రీకృష్ణుఁడు, అనలస = అల్పముగాని, హర్షప్రవేశమహిమకతన, తనచెల్వము = విలాసము, అతిశుద్ధి గాంచి యమరఁగా, వినుతి = ధర్మరాజాదిస్తోత్రమును, చేకొని, తనదుపురికిన్ = ద్వారకకు, ఏగెను.
| వ. | అ ట్లేగి యుచితభంగి నంగీకృతసకలసామ్రాజ్యభోగలీలావిశేషుం | 257 |
| క. | శాంతనవోక్తివిలాసా, త్యంతసుశిక్షితసమస్తధర్మతఁ జేసెన్ | 258 |