Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైన యాత్మగలవాఁడగుచు, అప్పుడు, ఆవీరయోధాగ్రణి = రాముఁడు, అమరశత్రు = రావణునియొక్క, మస్తకములు కొట్టికొట్టి, ఊర్జిత = స్థిరమైన, బలము గలవాని, ఉత్తమమైన, ఓజున్ = తేజస్సు గలవాని, కృష్ణతనున్ = నీలదేహుని, భవు = ఈశ్వరునియొక్క, వరోదయంబున వెలిఁగెడు, సంగరకృతి = యుద్ధక్రియయందు, ధృష్ట = ధీరమైన, ద్యుమ్నున్ = శౌర్యము గలవాని, "ద్యుమ్నుం విత్తే పరాక్రమే” అని వి. శాత్రవులయొక్క, అసు = ప్రాణములనెడి, పృథుపణి = క్రూరసర్పములకు, శిఖండిన్ = నెమలివంటివాని, ఇట్టిరావణుని, భీమవిజయదీప్తమైన మహిమచేత, తెగటార్చి = చంపి, ఉదీర్ణ= ప్రసిద్ధమైన, తేజస్సు గలవాఁ డాయెను.

భారత. అలఘుదోఃప్రౌఢిగల, మాతుల = మేనమామయయిన కృపునియొక్కయు, కృతవర్మయొక్కయు, వీరయోధాగ్రణి = అశ్వత్థామ, బలిమిచేత, అమర, శత్రుమస్తకములు కొట్టికొట్టి, ఉత్తమోజునిని, కృష్ణ = ద్రౌపదియొక్క, తనుభవులన్ = ప్రతివింధ్యాదిపుత్త్రులనును, సంగరకృతి = యుద్ధసమర్థుఁడయిన, ధృష్టద్యుమ్నునిని, శాత్రవులయొక్క, అసు = ప్రాణవాయువులకు, పృథుపణి = ఘనసర్పమైనవాని, శిఖండినిని దెగటార్చి భీమవిజయులయొక్క దీప్తమహిమచేత, దీర్ఘ = పోమొత్తఁబడిన, తేజస్సు గలవాఁ డాయెను.

వ.

అంత.

254


సీ.

క్రీడానరుం డైన శ్రీవరుం డిట్లు క్షా
           త్రప్రక్రియను విజయప్రశక్తి
నిర్వహించుచు శత్రునిర్మూలనము సల్పి
           సొంపుమైఁ దనకును శుభపదవిక
లంకాధిరాజ్యవిలాసపట్టాభిషే
           కము స్వపురస్స్ఫూర్జితముగ నడప
వసుధ నప్పుడు దానవప్రభుత్వవిశేష
           పృథుతరదీప్తి విభీషణుండు


ఆ.

తేజరిల్లె ధర్మరాజితరక్షమా
పాలదుర్లభతరభాగ్యలక్ష్మి
నేఁడుగా ఫలించె నెఱయ నస్మత్పూర్వ
సుకృత మద్భుత మని సుజను లలర.

255

భారత. క్రీడానరుండయిన శ్రీవరుండు = కృష్ణుఁడు, క్షాత్ర = క్షత్తృసంబంధమైన - సారథిసంబంధమైన, “సూతః క్షత్త్రా చ సారథిః" అని అ. ప్రక్రియన్ = వర్తనచేత,