Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వేశ మారాత్రిచరగోత్రవిభునిలీలఁ
గలఁచె స్వాపహృతోరువిక్రమతఁ గుంద.

252

భారత. దిగ్వధూ = దిక్కు లనెడుస్త్రీలయొక్క, జాలముయొక్క, ధమ్మిల్ల = కొప్పులయందు, ధృత = ధరింపఁబడిన, విశుద్ధ = నిర్మలమైన, కీర్తి గలవాఁడు, గురుసూనుఁడు = అశ్వత్థామ, ఆరాజు = ధర్మరాజుయొక్క, కృత్స్న = సమస్తమైన, “కృత్స్నమశేష” మ్మని అ. బలనివేశము = పాళెము, ఆరాత్రి = దుర్యోధనుఁడు పడినదినమురాత్రియందే, చర = చరించెడి, గోత్రవిభుని = హిమవంతునియొక్క, లీలన్ = రీతిచేత, స్వాప = నిద్రచే, "స్యాన్నిద్రాశయనం స్వాప” అని అ. హృత = హరింపఁబడిన, ఉరువిక్రమము గలదౌటచేత, కుందన్ = నిద్రచేత బిరుసు చెడియుండఁగా ననుట. కలఁచెన్ = నొప్పించెను.

రామ. కీర్తి యనెడి, గురు = అధికమైన, సూన = పుష్పములు గలవాఁడు, “సూనం ప్రసవపుష్పయోః” అని అ. ఆరాజు = ఆరఘునాథుఁడు, కృత్స్న = సమస్తమైన, బల = బలిమికి, నివేశము = స్థానమైనవాఁడు, ఆరాత్రిచరగోత్రవిభునిన్ = ఆరాక్షసవంశాధీశ్వరుఁడైనరావణాసురుని, లీలన్ = అవలీలచేత, స్వ = తనచేత, అపహృతమైన, ఉరు = అధికమైన, విక్రమతన్ = విక్రమము గలవాఁడై, కుందన్ = తగ్గుపడునట్టుగా, కలఁచెన్ = చలింపఁజేసెను.

సీ.

అలఘుదోఃప్రౌఢిమాతులకృతవర్మసా
           హాయ్యకంబున నభేద్యాత్ముఁ డగుచు
నప్పు డావీరయోధాగ్రణి యుగ్రంపు
           భల్లవర్షంబులబలిమి నమర
శత్రుమస్తకము లసంఖ్యంబులై ధర
           గుంపులు పడుచుండఁ గొట్టికొట్టి
యంతట సత్యమోఘాస్త్రప్రయోగుఁ డై
           యూర్జితబలు నుత్తమోజుఁ గృష్ణ


తే.

తనుభవులసద్వరోదయంబున వెలిఁగెడు
సంగరకృతిధృష్టద్యుమ్ను శాత్రవాసు
పృథుఫణిశిఖండిఁ దెగటార్చి భీమవిజయ
దీప్తమహిమచేతనుదీర్ణతేజుఁ డయ్యె.

253

రామ. అలఘు = అధికమైన, దోఃప్రౌఢిము = భుజబలముచేత, అతుల = సరిలేనట్టుగా, కృతమైన, వర్మ = జోడుయొక్క, సాహాయ్యకంబునన్ = సహాయత్వముచేత, అభేద్య