Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెరపన్ = శౌర్యము చూపఁగాను, మండలగతిఁ దిరుగ, గదుమన్ = వీఁగనొత్తఁగాను, నారదునకు నయనతుష్టి యబ్బెను.

భారత. చలపట్టి వెదకుచు, ధర్మరాజు = పాండవజ్యేష్ఠుఁడు, వెడలఁద్రోయఁగన్ = వెళ్లఁదీయఁగా, తన = తనయొక్క, వారి = నీళ్లలోనుండి, నిర్గమోద్దతి = వచ్చెడువడి, వెరఁగొనర్ప, కలంక విడిచి, రాజరాజు = దుర్యోధనుఁడు, సయిదోడుసూడుబంటయి = తమ్ములపగ దీర్చుకొనువాఁడై, నరవరుని భీమునిఁ దాఁకెను. వారు = ఆభీమదుర్యోధనులు, గదలన్ = గుదియలచేత, బిరుసు నెరప, అబ్బెను. క్రియ.

తే.

పొసఁగ నేఁడు గదారణభుక్తి దొరకె
నాకుఁ గను దనియఁగ నని నారదుండు
సమ్మదముఁ జెందఁ దిర మైనయమ్ములపస
నొండొరుల మించి పోరి రయ్యోధవరులు.

245

భారత. గదారణభుక్తి = గదాయుద్ధానుభవము, తిరమై, నయమ్ములపస = నేర్పుపసను.

రామ. పొసఁగ, నేఁడుగదా, తిరమైన, అమ్ములపసన్ = అస్త్రకౌశలముచేత, కడమ సులభము.

వ.

ఇట్లు గడంగి మహాయుద్ధంబు సేయునంత.

246


ఉ.

అంచితనైపుణిం బరఁగు నంబకఘోరతరప్రయుక్తిచే
మించుగదానవోద్ధతిసమృద్ధి గనంబడుచుండఁ బోరు సా
గించుచునుండ మానగుణకీర్తితు రాజులఱేనిఁ జూచి శం
కించిరి నమ్మరాదు మనగె ల్పనుచున్ హరిముఖ్యు లెంతయున్.

247

రామ. అంబక = బాణములయొక్క, ఘోరతరమైన, ప్రయుక్తిచేన్ = ప్రయోగముచేత, మించుగ, దానవోద్ధతి = రావణార్ధత్యము, కనంబడుచుండ, రాజులఱేనిన్ = రాముని, చూచి, హరిముఖ్యులు = వానరశ్రేష్ఠులు, శంకించిరి.

భారత. అంచితనైపుణిని, అంబక = నేత్రములకు, ఘోరతరమైన, ప్రయుక్తిచేన్ = వ్యాపారముచేత, మించు, గదా = గుదియలయొక్క, నవ = వింతైన, ఉద్ధతి = ప్రహారములయొక్క, సమృద్ధి = అతిశయము, కనంబడుచుండ, రాజులఱేనిన్ = దుర్యోధనుని, చూచి, హరిముఖ్యులు = కృష్ణాదులు, శంకించిరి, కడమ సమము.

వ.

తదనంతరంబ.

248


క.

చేవ చెదరి భీమాశుగ
దావహతికృతోరుభంగతాపజ్జ్వలితుం