Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెచ్చెనని క్రింది కన్వయము, ఈతఁడు అనిజగతిలో, ననున్ = నన్ను, అవగుణాధికునిఁగాన్ = అవివేకిఁగా, ఎన్నకున్నె = ఎంచునే యనుట.

ఉ.

ఎంతయు నిబ్బరం బయిన యీహనుమద్బలయుక్తిఁ జేసి యేఁ
బంతము మీఱ ఘోరపరిపంథులఁ ద్రుంచుట యెప్పు డింక నా
ర్జింతునొకో సమీరసుతుచేఁతకు నీడుగఁ జేసి మేలు దు
స్స్వాంతుఁడు గాఁ డితం డనుయశస్స్ఫురణంబు జగంబులోపలన్.

భారత. ఈహను = కోరికను, మద్బలయుక్తిన్ = నాబలిమిచేత, పరిపంథుల = శత్రువులను, త్రుంచుట యెప్పుడు - ఇది యుత్సాహవాక్యము. సమీరసుతు = భీమునియొక్క, చేఁతకు నీడుగఁ జేసి యశఃస్ఫురణంబును, ఆర్జింతునొకో యని యన్వయము.

రామ. ఈ, హనుమత్ = హనుమంతునియొక్క, బలయుక్తిఁ జేసి = బలయోగముచేత, నేను, పరిపంథుల, త్రుంచుట = సంహరించితిఁగదా, సమీరసుతు = హనుమంతునియొక్క, చేఁతకున్ = ఉపకారమునకు, ఈడుగఁ జేసి = ప్రత్యుపకారముఁ జేసి, యశఃస్ఫురణంబును, ఆర్జింతునొకో = కాకుస్వరము.

వ.

అని తలపోయుచు రిపుజయప్రయతమానమానసుం డయ్యె నంత.

243


సీ.

చలపట్టి తనుఁ జంప నముదితోపాయప
           ద్ధతి వెదకుచుఁ గని ధర్మరాజు
వెడలఁ ద్రోయఁగ నొండు వెరవులు చాలించి
           తనవారినిర్గమోద్ధతి పగఱకు
వెరఁ గొనర్పఁగలంక విడిచి బెట్టిదపుబీ
           రమునఁ బఱతెంచి రాజరాజు
సయిదోడుసూడుబంటయి మదనుజఘాతి
           నిను మున్ను దెగటార్తు నని నరవరు


తే.

భీముఁ దాఁకె నపూర్వసంభృతరణరస
భారు లై యొండొరులఁ దాఁక వారు గదల
బిరుసు నెరప మండలగతిఁ దిరుగగదుమ
నారదున కబ్బె వేర్వేఱ నయనతుష్టి.

244

రామ. ధర్మరాజు = యముఁడు, వెడలఁ ద్రోయఁగ, తనవారి = తనమూఁకలయొక్క, నిర్గమోద్ధతి వెరఁగొనర్పఁగ, లంక విడిచి, రాజరాజుసయిదోడు = కుబేరునితమ్ముఁడు రావణుఁడు, సూడుబంటయి = పగదీర్చుకొనువాఁడై, మదనుజఘాతినిన్ = కుంభకర్ణునిఁజంపిన, నరవరున్ = రాముని, తాఁకెను, వారు రామరావణులు, కదలన్ = చలింపఁగాను, బిరుసు