Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భయంకరమైనవాని, మహావిపక్షున్ = రావణుని, విముక్తమైన, విగ్రహ = యుద్ధము గలవానిఁగా, ఒనర్చి = పాఱఁద్రోలి యనుట, దురటిల్లెను, కడమ సమము.

సీ.

అంతలావునఁ బేర్చి యనిలజుండు నిజాను
           జప్రాణదానంబు సలిపి తనదు
మదిలో నమోదసంపదలు నింపుచు నుండ
           నానృపాలుఁ డిటని యాత్మ నెంచె
ఘనశౌర్యధైర్యవిఖ్యాతి మిక్కిలిని వ
           ర్తిలుచుండ బ్రతుకుమందులనగమును
మానుగ వినివారితోనతాదోషస
           త్త్వారూఢినిసమానుఁ డగుచుఁ దెచ్చె


తే.

వంశమున కెల్లఁ గీర్త్యభావంబు మిగుల
నీతఁ డీతనిఁ దల్లి దా నెట్టివేళఁ
గనియెనో యని జగతిలో ననుజనౌఘ
మెల్ల నవగుణాధికునిఁగా నెన్న కున్నె.

241

రామ. అంతన్ = అంతటను, అనిలజుండు = హనుమంతుఁడు, నిజానుజ = లక్ష్మణునియొక్క, ప్రాణదానంబు = బ్రతికించుటను, చలిపి, మోదసంపదలు = సంతోషాతిశయములను, నింపుచునుండఁగా, ఆనృపాలుఁడు రాముఁడు, ఎంచినప్రకారము చెప్పుచున్నాఁడు, ఈతఁడు = హనుమంతుఁడు, బ్రతుకుమందుల = సంజీవనౌషధులయొక్క, నగమును, వినివారిత = మిక్కిలివారింపఁబడిన, ఊనతాదోష = న్యూనత్వదోషము గల, సత్త్వారూఢిచేత, సమానుఁ డగుచు, మానసహితుఁడై, కీర్త్య = కీర్తనీయమైన, భావంబు = వర్తన, మిగులఁగా, తెచ్చెనని క్రింది కన్వయము. జగతిలోనను, జనౌఘము = జనసమూహము, నవగుణ = మనోహరగుణములచేత, అధికునిఁగా నెన్నకున్నె.

భారత. అంత = అంతైన, లావునన్ = బలిమిచేత, అనిలజుండు = భీముఁడు, నిజానుజ = దుశ్శాసనునియొక్క, ప్రాణదానంబు = ప్రాణఖండనమును, చలిపి, తనదుమదిలో, అమోదసంపదలు = ఖేదాతిశయములను, నింపుచునుండ, ఆనృపాలుఁడు = దుర్యోధనుఁడు, ఎంచెను, ఖ్యాతిమిక్కిలి, నివర్తిలుచుండ = పోవుచుండఁగా, బ్రతుకు = బ్రతుకుచున్న, మందుల = నిర్భాగ్యులను, "మూఢాల్పాపటునిర్భాగ్యమందాః” అని అ. నగన్=నవ్వఁగా, మును = ముందర, మానుగ, విని = వినియుండియు, వారితోన = వారితో నట్టె, తాన్ = తాను, దోషముయొక్క, సత్త్వ = బలిమియొక్క, ఆరూఢిని = ప్రసిద్ధిచేత, సమానుఁడగుచున్ = సరియైనవాఁడై, వంశమునకెల్ల కీర్తియొక్క యభావంబును,