రామ. ఆదుష్టవర్తనుఁడు = రావణుఁడు, వగచుచు, వైరినృపతిని, అనుజుఁడైనలక్ష్మణునియొక్కయు విభీషణునియొక్కయు నుదగ్రవిక్రమసహాయత్వముచేత విజృంభించు మహాప్రతాపునిన్ = రఘునాయకుని, తలపడన్ = మార్కొనుటకు, చాలన్ = మిక్కిలి, నితాంత=అధికమయిన, ధైర్యంబుతో, ద్వైప = ద్వీపసంబంధమైన, ఆయన = మార్గమందుఁ గల, హ్రదమతల్లికా = హ్రదశ్రేష్ఠముయొక్క - మంచిమడుగుయొక్క యనుట, గతిని = ప్రకారమున, తన్నృపతి = ఆరామునియొక్క, బల = సేనలయొక్క, శ్రీ = శృంగారము, కలంగఁగా, అరిగెనని క్రిందటి కన్వయము. అరిగి = ఈలాగు నడచి, తత్ = ఆరామునియొక్క కాండచయంబులోనన్ = బాణసమూహములోను, మునిఁగెను, మునిఁగి = ఈలాగు మునిఁగి, దానిన్ = ఆబాణసమూహమును, తిరమై, నవమైన, ఆస్తంభ = జాడ్యము లేని - ప్రకాశించుచున్నదనుట, ధర్మ = వింటియొక్క, పటిమన్ = సామర్థ్యముచేత, మేను మోయకుండ, ఆఁగెను = అస్త్రములకుఁ బ్రత్యస్త్రముల నేసెను.
భారత. ఆదుష్టవర్తనుఁడు = దుర్యోధనుఁడు, అనుజ = తమ్ములయొక్క, విభీషణ = భయంకరమునయి, ఉదగ్ర = అధికమైన, విక్రమసహాయత్వముచేత, మహాప్రతాపుని, వైరినృపతిన్ = ధర్మరాజును, తలపడఁజాలని = ఎదిరింపలేని, తాంత = తగ్గిన, ధైర్యంబుతో ద్వైపాయన మనెడి, హ్రదమతల్లికిన్ = హ్రదశ్రేష్ఠమునకు, ఆగతిని = ఆప్రకారమున - ఒంటికాఁడై యనుట. తన్నృపతి = ఆదుర్యోధనుఁడు, అరిగెను, తత్ = ఆమడుగుయొక్క, కాండచయంబులోనన్ = నీళ్లలోపల, మునిఁగి, తిరమైన, వాఃస్తంభనయొక్క ధర్మగుణముయొక్క పటిమచేత, దానిన్ = ఆయుదకమును, మేను మోయకుండ నాఁగెను, జలస్తంభనవిద్య కలదు గనుక.
| వ. | అట్టిసమయంబున. | 239 |
| చ. | అయమితభీమశక్తివిహితానుజపాతనుఁ డై గృశించుచు | 240 |
భారత. అయమిత=అణఁపఁబడని, భీమునియొక్క, శక్తి = బలిమిచేత, విహిత = చేయఁబడిన, అనుజపాతనుఁడై = దుశ్శాసనాదినాశము గలవాఁడై, అహత = అడఁగని, శోకము గలవాఁడు, మనుజనాథుఁడు = దుర్యోధనుఁడు, భీముని, విముక్తవిగ్రహున్ = శరీరరహితునిగా, అను = అనెడి, ఖేదమున, దురటిల్లెన్ = కెరలెను.
రామ. అయమిత = అడ్డపెట్టఁబడని, భీమమైన శక్తిచేత విహితమైన, ఆనుజ = లక్ష్మణునియొక్క, పాతనముగలవాఁడై కృశించుచు, నయ = నీతిచేత - ఇది శోకసమయము గాదనునీతిచేత ననుట, హతిశోకుఁ డమ్మనుజనాథుఁడు = రాముఁడు, భీమున్ =