Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మానసధృతిఁ బెనుపఁగ నరి
పై నడరి శరోగ్రవృష్టిఁ బఱఁగించె వడిన్.

222

రామ. జిష్ణుఁడు = జయశీలుఁడు, సుమిత్రానందనుఁడు = లక్ష్మణుఁడు.

భారత. సుమిత్ర = బంధువులను, ఆనందనుఁడు = సంతోషపెట్టెడువాఁడు. మానసమందుఁ గల, ధృతిన్ =సంతోషమును, కడమ సరి.

క.

శరవర్ష మిట్లు గురియుచుఁ
బరఁగుమహాబలజయానుభావస్థైర్య
స్ఫురణాఢ్యు నతని నతఁడున్
సరభసనారాచవృష్టి సంవృతుఁ జేసెన్.

223

భారత. మహత్ = అధికమైన, బలజయములయొక్క, అనుభావస్థైర్యస్ఫురణచేతనాఢ్యుని, అతనిన్ = అర్జునుని, అతఁడు = కర్ణుఁడును, నారాచవృష్టి చత, సంవృతుఁ జేసెన్ = ఆవరింపఁబడ్డవానిఁగాఁ జేసెను.

రామ. మహాబలజ = హనుమంతుఁడు, యానున్ = వాహనముగాఁ గలవాని, అతనిన్ = లక్ష్మణుని, అతఁడున్ = ఇంద్రజిత్తును, చేసెను, కడమ సులభము.

వ.

ఇట్లు దలపడి.

224


ఆ.

సరిగఁ బోరి రక్కజపుజోదు లిరువురుఁ
గరియుఁ గరియుఁ బోలెఁ గడిఁదిలావు
గిరియు గిరియుఁ బోలె గెంటనితాల్మియు
హరియు హరియుఁ బోలె నదటు వొదల.

225

రెంటికి సరి సులభము.

సీ.

ఒండొరులసరోషహుంకృతిఁ గెరలుచుఁ
           గెరలి తూపులవాన గురిసి కురిసి
శరవృష్టి బత్యస్త్రసమితిచే నఱుకుచు
           నఱికి పై నమ్ములు వఱపి పఱపి
సాధనవికలత సాధించి మించుచు
           మించి నెమ్మేనులు నొంచి నొంచి
దివ్యాస్త్రములు సాలఁ దెగువమై నేయుచు
           నేసి నిష్ఫల మైన రేసి రేసి


తే.

లలి నొకరొకళ్లకడకల లక్ష్మణేంద్ర
జిత్తు లాభీలశౌర్యులై చిత్రరణము