మేఘనాదాభిధానుఁడు = ఇంద్రజిత్తు, ఆబలాఢ్యుమీఁదన్ = సేనతోఁ గూడిన రామునిమీఁద, నడచి నభముననుండి దురమొనర్చెను.
| వ. | ఇట్లు పోరిపోరి. | 218 |
| ఉత్సాహ. | వెరవు నేపుఁ జూపెడు ప్రతివీరువిక్రమక్రియా | 219 |
రామ. గరిమ = మహత్త్వమును, మును = మునుపు.
భారత. గరిమమును = అతిశయమును. కడమ సరి.
| మ. | బలదీప్తాశుగసంతతిప్రబలితస్ఫారప్రతాపోదయో | 220 |
భారత. బలదీప్తమయిన, ఆశుగసంతతి = బాణజాలముచేత, ప్రబలితమైన, స్ఫార = ప్రకాశింపుచున్న, ప్రతాపోదయముచేత నుజ్జ్వలమయిన, సంయత్ = యుద్ధమందుఁ గల, “సంయత్సమిత్యాజిసమిద్యుద్ధ” మని అ. రభసంబు= ఆటోపము, రుద్రునియొక్క, మఖసంచారక్రియన్ = దక్షాధ్వరక్రీడను, మీఱఁగా నట్టియెడను, ఆనాకీశసంతానము = అర్జునుఁడు, ప్రతివీరుని = కర్ణుని, నలఁగించెను. అయ్యలఘుస్థేముఁడున్ = కర్ణుఁడును, తత్ = ఆయర్జునునియొక్క, ప్రతాపశిఖిన్ = ప్రతాపాగ్నిని, మాయం జేసి యార్చెను.
రామ. బలదీప్తుఁడైన, ఆశుగసంతతి = హనుమంతునిచేత, ప్రబలిత = ప్రబలముగాఁ జేయఁబడిన, స్ఫారప్రతాపోదయముచేత నుజ్జ్వలమైన, సంయత్ = యుద్ధముయొక్క, రభసంబు = వేగము, ఉరు = అధికమైన, ద్రుమ = వృక్షములయొక్క, ఖసంచారక్రియన్ = ఆకసమున విసరివేయుటచేత, మీఱఁగాన్ = మిక్కి_లియు నొప్పఁగా, నానా, కీశసంతానము = వానరసమూహము, ప్రతివీరున్ = ఇంద్రజిత్తును, నలఁగించెను, అయ్యలఘుస్థేముఁడున్ = అధికస్థైర్యముగల యాయింద్రజిత్తును, మాయం జేసి = మాయచేత, తత్ = ఆవానరసమూహముయొక్క, ప్రతాపశిఖిని, ఆర్చెన్ = చల్లార్చెను.
| వ. | అంత. | 221 |
| క. | మాననిధి జిష్ణుఁడు సుమి | |