Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉబ్బఁగ మీఱెన్ = భీష్మద్రోణులకంటెను లెస్సగా జగడము చేసెననుట. ఆప్రబలదోషాచారి = మిక్కిలి దురాచారియైన దుర్యోధనునియొక్కతోఁబుట్టుగును, దుశ్శాసనాభిఖ్యునిన్ = దుశ్శాసనుఁ డనెడుపేరు గలవాని, పవనాత్మజుండు కూల్చెను.

వ.

అంత.

216


సీ.

ఆహవమహిమకరాక్షయాతులసత్ప్ర
           తాప మత్యంతము దనరఁ గనలి
సూర్యసంతతినరవర్యుండు సాహసౌ
           ద్ధత్యశౌర్యాదిదుర్దాంతవృత్తిఁ
బ్రబలువానిని ధర్మరాజువీడు సొరంగఁ
           దఱిమె బాణముల నెంతయుఁ గలంచి
తద్భ్రాతృభంగ మంతయు నప్పు డరసి వా
           సవినిర్గతుం డయి సరభసమున


ఆ.

స్వశ్రితనికురుంబవనశిఖిమేఘనా
దాభిధానుఁ డాబలాఢ్యుమీఁద
నడచి దుర మొనర్చె నభమున నుండి ని
ర్జరులు బెగడ నిగుడు సాయకముల.

217

భారత. ఆహవ = యుద్ధముయొక్క, మహిమకర = ప్రభావమును జేయుచున్న, అక్షయ = అక్షయము నయి, అతుల = సరిలేని, సత్ప్రతాపము తనరునట్టుగా, సూర్యసంతతినరవర్యుండు = కర్ణుఁడు, వృత్తిచేతఁ బ్రబలువాని ధర్మరాజును వీడుఁ జొరఁగఁ దఱిమెను. తత్ = ఆ, భ్రాతృభంగమంతయు నప్పు డరసి, వాసవి = అర్జునుఁడు, స్వశ్రిత = నిజాశ్రితు లనెడు, వనశిఖి = అడవినెమళ్లకు, “శిఖావళశ్శిఖీ కేకీ" అని అ. మేఘనాదమువంటి, అభిధాన = పేరుగలవాఁడు, అర్జునునికి విశేషణము. ఆబలాఢ్యుమీఁద నడచి, సాయకములన్ = బాణములచేత, నభమున నుండి = ఆకాశమం దుండి, నిర్జరులు బెగడునట్టుగా దుర మొనర్చెను.

రామ. ఆహవమహిన్ = యుద్ధభూమియందు, మకరాక్షయాతు = మకరాక్షుఁ డను ఖరాసురుని పుత్త్రునియొక్క, “నైరృతో యాతు రక్షసీ" అని అ. లసత్ప్రతాప మత్యంతము తనరుచుండఁగాఁ గనలి, సూర్యసంతతినరవర్యుండు = రాముఁడు, వృత్తిచేతఁ బ్రబలెడువానిని = ఆమకరాక్షుని, ధర్మరాజువీడు = యమలోకమును, చొరంగఁ దఱిమెన్ = చంపె ననుట, తద్భ్రాతృభంగము = ఆమకరాక్షునిమరణమును, అరసి, వాస = గృహము వల్లనుండి, వినిర్గతుండయి, స్వశ్శ్రిత = దేవత లనెడి, వనమునకు, శిఖి = అగ్నివంటివాఁడు,