Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. అతఁడు = హనుమంతుఁడు, సకలసైన్యవితతిని, సంజీవనౌషధులయొక్క, సమానయన = తెచ్చుటచేత, విహితమైన, పునఃప్రతిష్ఠగాన్ = తిరుగ బ్రతుకుట గలదానిఁగా, ఒనర్చి, శౌర్యముయొక్కయు, విక్రమ = అధిక సామర్థ్యముయొక్కయు, నయ = నీతియొక్కయు, చర్యను నడపెను.

తే.

అపుడు మనుజేంద్రముఖ్యు లాహరి నుతించి
రనఘ నీదుమహత్త్వ మేమని పొగడఁగ
వచ్చు నారాయణమహాస్త్రవైభవ మిటు
లఫలముగఁ జేసి రిపులక్రొ వ్వడఁచి తనుచు.

213

రామ. హరిన్ = హనుమంతుని, నారాయణ - ఆశ్చర్యవాక్యము, మహాస్త్ర = బ్రహ్మాస్త్రముయొక్క.

భారత. మనుజేంద్రముఖ్యులు = ధర్మరాజాదులు, రెంటికి సరి. కడమ సులభము.

చ.

అలఘువిపన్మహార్ణవము నట్లు తరించి పునర్మహోద్ధతిన్
వెలిగెడువారిఁ దద్రజని వేగ భయంకరలీలఁ దాఁకి పెం
పలరఁగఁ బోరె వైరిచయ మర్కజుఁ డందు వహించె మిక్కిలిన్
బలిమిఁ బ్రకంపితస్వపృత నాపరిపాలనకార్యభారమున్.

214

భారత. తద్రజని = ఆరాత్రి, వేగన్ = వేగఁగా, అందు= ఆయుద్ధమందు.

రామ. తద్రజనిన్ = ఆరాత్రియందు.

మ.

రవిపుత్రుం డని కిట్లు పూని ప్రతిగర్జద్వీరసంహారకౢ
ఫ్తివిరాజచ్ఛరభీష్మకుంభజయశోభివ్యాప్తి మీఱెన్ మను
ష్యవిభుం డుబ్బఁగ నంత నాప్రబలదోషాచారితోఁబుట్టుగున్
భువిఁగూల్చెన్ బవనాత్మజుండు బలిమిన్ దుశ్శాసనాభిఖ్యునిన్.

215

రామ. రవిపుత్రుండు = సుగ్రీవుఁడు, ప్రతిగర్జత్ = మాఱుమలయచున్న, వీర = శత్రువులయొక్క, సంహారముయొక్క, కౢప్తి = చేఁతచే, విరాజత్ = ప్రకాశింపుచున్న, భీష్మ = భయంకరుఁడైన, కుంభ = కుంభుఁ డనెడి కుంభకర్ణునికుమారునియొక్క, జయము చేత, శోభి = ఒప్పుచున్న, వ్యాప్తిన్ = వ్యాపారముచేత, మనుష్యవిభుండు = రాముఁడు, ఉబ్బఁగ, మీఱెను. ఆప్రబలదోషాచారి = ఆప్రబలుఁడైన నక్తంచరునియొక్క, “దోషానక్తంచరజనీ" అని వి. తోఁబుట్టుగున్ = తమ్ముఁడైన నికుంభుని, దుశ్శాసన = ఆణఁపరాని, అభిఖ్యునిన్ = కాంతి గలవాని, "అభిఖ్యా నామశోభయోః” అని అ. పవనాత్మజుండు కూల్చెను.

భారత. రవిపుత్త్రుండు = కర్ణుఁడు, విరాజచ్ఛరములు గల భీష్మునియొక్క, కుంభజ = ద్రోణునియొక్కయు, యశోభివ్యాప్తిని, మనుష్యవిభుండు = దుర్యోధనుఁడు,