| | కత్యాదరతఁ బంచె నస్త్రనైపుణిఁ జూపె | |
| తే. | చేష్టు లైరి తద్బ్రహ్మాస్త్రవిజృంభణమున | 210 |
రామ. గురు = అధికమైన, దుర్యోధనుండని = యుద్ధము సేయ శక్యము గానివాఁడని, బహుభ్రాతృనాశముచేతఁ గఠోరతరములైన, మన్యున్ = శోకక్రోధములు గలవాని, దశముఖుఁడు = రావణుఁడు, పంచెను = అంపెను. తత్ = ఆయింద్రజిత్తుయొక్క, బ్రహ్మాస్త్రవిజృంభణమున కెదురులేక, మూర్ఛన్ = మూర్ఛచేత, మానమదము లడఁగఁగా, ప్రతివీరులు = రామాదులు, అపగతరణచేష్టులైరి, తత్ = ఆబ్రహ్మాస్త్రముయొక్క, ప్రతివిధాన = ప్రతిక్రియకు, కుశల= సమర్థమునై, అచ్యుత = స్థిరమైన, ప్రయత్నముచేత.
భారత. గురున్ = ద్రోణుని, మీఱినవాని, ద్రోణునియొక్క గారాపుబట్టిని, ఉగ్రుఁడైనవాని, ఆతీవ్రబలుని, ఇవి యశ్వత్థామకు విశేషణములు. దుర్యోధనుండు, అనిన్ = యుద్ధమందు, గెల్చును, ఒనర్పఁగ జాలునని, బహుభ్రాతృనాశముచేతఁ గఠోరతరమైన మన్యుదశ గల ముఖము గలవాఁడు - ఇది దుర్యోధనునికి విశేషణము. అరివధమునకుఁ బంచెను. తద్బ్రహ్మ = ఆబ్రాహ్మణునియొక్క, అస్త్రవిజృంభణమునకు, మూర్ఛత్ = వ్యాపించుచున్న, “మూర్ఛామోహసముచ్ఛాయయోః” అని ధాతువు. మానమును మదము నడఁగఁగా, తత్ = ఆబ్రాహ్మణునిబాణముయొక్క, ప్రతివిధానమునకు, కుశల = సమర్థుఁడైన, అచ్యుత = కృష్ణునియొక్క, ప్రయత్నమున, ప్రతివీరులు, అపగత = విడువఁబడిన, రణచేష్ట గలవార లైరి యని క్రిందటి కన్వయము. కృష్ణునిమాటవలన నాయుధములు పడవైచి యానారాయణాస్త్రమునకు నమస్కరించి రనుట. అపుడు, ఆనిలసుతుఁడు = భీముఁడు, బిరుసు డింపక యొప్పెను = నమస్కరించక యుండెననుట.
| వ. | అంత. | |
| ఆ. | అతఁడు సకలసైన్యవితతిని సంజీవ, నౌషధీసమాన యన విహితపు | 211 |
భారత. అతఁడు = భీముఁడును, సంజీవనౌషధీసమాన, అనన్ = అనఁగాను, సైన్యవితతిని, విహిత = చేయఁబడిన, పునఃప్రతిష్ఠ గలదానిగా నొనర్చి వర్ణన కెక్కెడి, శౌరి = కృష్ణునియొక్క, అవిశ్రమ = క్రమరహితమైన, నయచర్యన్ = నీతిమార్గమును, నడపెను. కృష్ణునియొక్క సంజీవనివంటినీతిచేత భీముఁడు నాయుధమును విడిచెననుట.