Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముఁడు గనుక దేహకాంతి తఱుగ దనుట. రణకళాధికారి, గాంభీర్యతోయధి, ఘటోద్భవుండు = ద్రోణుఁడు, ద్రుపదముఖ్యులన్ = ద్రుపదుఁడు మొదలయినవారిని, వధించెను.

మ.

అనివార్యుం డతఁ డంతటం దనయమిథ్యామృత్యువార్తాప్రవ
ర్తనచేతం గురుమానసార్పితవిషాదగ్లాని యయ్యెం దనుం
దనునిర్ముక్తునిఁ జేయుచున్ విశిఖసంధానాతివేగప్రపం
చనసౌమిత్రి యనేకయుద్ధకృతి ధృష్టద్యుమ్నుఁ డేపారఁగన్.

208

భారత. అతఁడు = ద్రోణుఁడు, అంతటను, తనయ = కుమారునియొక్క - అశ్వత్థామయొక్క, మిథ్యా = అసత్యమైన, మృత్యువార్తాప్రవర్తనచేత, తను, తనునిర్ముక్తునిన్ = దేహనిర్ముక్తునిఁగా, చేయుచున్ - తనకుఁ దానే దేహము విడుచుచు ననుట. విశిఖ = బాణములయొక్క, సంధానమందు నతివేగమైన, ప్రపంచన = ప్రయోగమందును, సౌమిత్రి = లక్ష్మణుండైనవాఁడు, అనేకయుద్ధములయందు, కృతి = నేర్పరియైనవాఁడు, ధృష్టద్యుమ్నుఁడు, ఏపారఁగా, గురు = అధికమౌనట్టుగా, పెద్దలయొక్కయనికాని, మానసమందు, ఆర్పిత= పెట్టఁబడిన, విషాదముచేతిగ్లాని గలవాఁ డయ్యెను.

రామ. అతఁడు = అతికాయుఁడు, తన = తనయొక్క, విశిఖసంధానమందలి యతివేగముయొక్క, ప్రపంచనన్ = విస్తరించుటచేత, “పచివిస్తారే” అని ధాతువు. సౌమిత్రి = లక్ష్మణుఁడు, యుద్ధకృతి = యుద్ధక్రియయందు, ధృష్ట = దృఢమైన, ద్యుమ్న = సత్త్వము గలవాఁడు, “ద్యుమ్నం స్యాచ్చ బలే ధనే” అని వి. ఏపారఁగా, తనున్ = తన్ను, తనునిర్ముక్తునిఁ జేయుచు, తనయొక్క, అమిథ్యా = సత్యమైన, మృత్యువార్తయొక్క, ప్రవర్తనచేత = వినిపించుటచే, గురు = తండ్రియైన రావణునియొక్క, మానసమం దర్పితవిషాదగ్లాని యయ్యె నని యన్వయము. అతికాయుఁడు నొచ్చెను, ఆవార్త విని రావణుఁడు కస్తిపడెననుట.

వ.

అంత.

209


సీ.

గురుదివ్యబాణచాతురిని మీఱినవాని
           గారాపుఁబట్టి నఖండవిక్ర
మోగ్రు నెంతయును దుర్యోధనుం డని గెల్పుఁ
           దనకొనర్పఁగజాలు నని గణించి
యాతీవ్రబలుబహుభ్రాతృనాశకఠోర
           తరమన్యుదశముఖుఁ డరివధమున