Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. క్రమ్మఱఁ బొదువనీక = మఱిఁ బట్టువడక, అనిభృత = వ్యక్తమైన, ప్రీతితో, తనబలము, కూడన్ = కూడునట్టుగా, చనియెను, దనుజుండు = కుంభకర్ణుఁడు, కనలెను.

భారత. క్రమ్మఱఁ బొదువ = తిరుగ వాని జయించుటకు, నీక చనియె = నీకొక్కనికే చెల్లెను. అని = ఇట్లని, భృత = భరింపఁబడిన ప్రీతితో, వినుతి సేయన్ = స్తోత్రము చేయఁగా, తనబలము = తనసేనను, కూడఁగా, దనుజుండు = ఘటోత్కచుఁడు, కనలెను.

ఉత్సాహ.

కనలి యసుర ప్రళయకాలు కరణిఁ బేర్చి పగఱ బ
ల్మొనల కుఱికి యుఱికి గదియ మోది యాశుభక్షణం
బున మదించుతనకు జడిసి పోటుదొరలు దెరలఁగా
వనజమిత్రసంతతి ననవద్యుఁ జేరెఁ బోరికిన్.

203

భారత. ఆ, శుభలక్షణంబునన్ = శుభమైనయుత్సవముననే, “నిర్వ్యాపారస్థితౌ కాలవిశేషోత్సవయోః క్షణః" అని అ. శూరునికి యుద్ధమే యుత్సవము గనుక, వనజమిత్రసంతతిన్ = కర్ణుని, చేరెను.

రామ. కనలి, అసుర = కుంభకర్ణుఁడు, ఆశు = శీఘ్రమైన, భక్షణంబున, వనజమిత్రసంతతిన్ = సూర్యవంశము గల, అనవద్యున్ = రాముని, చేరెను. కడమ సరి.

వ.

చేరి యి ట్లనియె.

204


సీ.

విను నీవు వాండ్రవీండ్రను జయించితి నని
           క్రొవ్వకు మిచట నక్కొలఁదిఁబోఁడు
భూరిప్ర తాపసిందూరయశశ్చామ
           రాత్యలంకృతకకుబంతదంతి
కుంభకర్ణుఁడు రణక్రూరుండు భీమసు
           తుం డాహుతత్వదుద్దండబలుఁడు
బలురక్కసుఁడు పోరఁ బ్రబ్బినాఁ డిట్టిన
           న్నెఱిఁగి మార్కొను మిప్పు డేఁ బృథురణ


తే.

వైభవాలంబసదనుజ వధవిధి నిను
గలఁచి యిదె మ్రింగఁ గదిసితి నిలునిలు మని
ప్రౌఢి గనుటకుఁ దగ దాశరథివరేణ్య
కర్ణకఠినముల్ నీశౌర్యకథలు సభల.

205

రామ. కుంభకర్ణుఁడు రామునితో ననెడుమాట. భూరిప్రతాప మనెడిసిందూరముచేతను. యశః = కీర్తి యనెడి, చామరములచేతను, అత్యలంకృత = మిక్కిలి నలంకరింపఁ