Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గడు నంతఁ దెలినొంది కటకటా వీఁ డింత
           చేయునే యే నిదె చెండివైతు
వెస వీని నత్యంతవిశ్రుతి నాసత్వ
           మును జెందునట్లుగా ననుచు రేసి
సరభసోత్థానుఁ డై కరములసద్దశ
           నములనైపుణి ముమ్మరముగఁ


ఆ.

దనతలఁచినయట్లు దనుజశార్దూలున
వార్యమన్యువికృతవదనుఁ గాఁగ
నవయవములు వచ్చి యభ్రమునకుఁ బాఱ
నడఁచె వాఁడు పిడుగు నట్లమ్రోయ.

200

భారత. అనిషేధనీయ = మానుపశక్యముగాని, మానుండై = అభిమానము గలవాఁడై, వివస్వత్తనూభవుండు = కర్ణుఁడు, తెలివొంది = ధైర్యముఁ దెచ్చుకొని, అత్యంతవిశ్రుతి = అత్యంతప్రసిద్ధి, నా, సత్త్వమును = బలిమిని, చెందునట్లుగా, నాశౌర్యమునకుఁ గీర్తి వచ్చునట్లుగా ననుట. వీనిఁ జెండివైతుననుచు, సరభసమైన, ఉత్థాన = ఉత్సాహము గలవాఁడై, కరము = మిక్కిలి, లసత్ = ఒప్పుచున్న, దశన్ = అవస్థను - భంగి ననుట. అమ్ములనైపుణి = బాణచాతుర్యము, ముమ్మరముగ, దనుజశార్దూలున్ = ఘటోత్కచుని, మన్యు = క్రోధముచేత, వికృతవదనుఁ గాఁగ, అభ్రమ్మునకున్ = ఆకాశమునకు, పాఱనడఁచెన్ = పాఱఁగొట్టెను.

రామ. అనిషేధ = అడ్డపెట్టుట లేకుండునట్లుగా, నీయమానుండై = కొంపోఁబడుచున్నవాఁడై, వివస్వత్తనూభవుండు = సుగ్రీవుఁడు, తెలివొంది = మూర్ఛఁ దెలిసి, అత్యంతమును, విశ్రుతినాసత్వమును = విగతములైన కర్ణనాసికములు కలవాఁడౌటను, చెందునట్టుగా, సరభస = వేగముతోఁ గూడిన, ఉత్థాన = ఎగయుట కలవాఁడై, కరములన్ = హ స్తములచేతను, సద్ధశనమ్ములన్ = వాఁడిపండ్లచేతను, అవార్యమైన, మన్యున్ = కోపము గల, దనుజశార్ధూలున్ = కుంభకర్ణుని, వికృతవదనుఁ గాఁగ, వ్రచ్చి, అభ్రమ్మునకు, పాఱన్ = ఎగయఁగా, వాఁడు = ఆకుంభకర్ణుడు, అడఁచెను= గ్రుద్దెను.

వ.

అప్పు డప్పద్మబంధునందనుండు.

201


తే.

ఈతెఱంగున ఘనదైత్యుచేత నొవ్వఁ
బొదువఁబడియునుఁ గ్రమ్మఱఁ బొదువనీక
చనియె ననిభృతప్రీతితో వినుతి సేయఁ
ధనబలము గూడ దనుజుండు గనలె మిగుల.

202