భారత. ఆశుగసంతతి = బాణసమూహముయొక్క, వడిన్ = వేగముచేత, అందికొని = పొదిగి, దైత్య = ఘటోత్కచునిచేత, ఈరిత = ప్రయోగింపఁబడిన, ఆయుధమును = ఆయుధములనన్నిటిని, త్రుంచెను. దనుజుఁడు =ఘటోత్కచుఁడు, పలాశి = వృక్షములయొక్కయు, “పలాశీ ద్రుద్రుమాగమాః” అని అ. ఘన = దట్టమైన, శిలా = రాళ్లయొక్కయు అభిహతిచేత, ఇనజున్ = కర్ణుని, ఉగ్రమన్యు = అధికరోషముచేత, మూర్ఛితునిన్ = వ్యాపింపఁబడ్డవానిఁగా, చేసెను.
| ఆ. | అంత నిలక యమ్మహాబలునిగృహీతుఁ | 198 |
భారత. అంత నిలక, అమ్మహాబలున్ = కర్ణుని, నిగృహీతుఁ జేసి = నిగ్రహించి - అణఁచి యనుట. కడమ సులభము.
రామ. అంత నిలక, అమ్మహాబలునిన్ = సుగ్రీవుని, గృహీతుఁ జేసి = పట్టుకొని, హరింతున్ = కొంపోయెదను. కడమ సరి.
| తే. | రాక్షసుండు ఖేలాగతి భ్రాజి యగుచు | 199 |
రామ. రాక్షసుండు = కుంభకర్ణుఁడు, ఖేలాగతి = లీలాగమనముచేత, భ్రాజి యగుచున్ = ఒప్పుచున్నవాఁడై, అర్కనందనున్ = సుగ్రీవుని, ఎత్తి, బాహాంతరమునన్ = రొమ్మున, అనఁగన్ = నిలుపుకోఁగా, తత్ = ఆసుగ్రీవునియొక్క, బలశ్రేణి, మహత్ = అధికమైన, శుక్ = శోకముచే నగు, “మన్యుశోకాతుశుక్ స్త్రియా” మ్మని అ. అంబుల = ఉదకములయొక్క - కన్నీళ్లయొక్క యనుట. వాన గురిసెను.
భారత. రాక్షసుండు = ఘటోత్కచుండు, ఖ = ఆకాశమందును, “గగనమనంతం సురవర్మ ఖ” మ్మని అ. ఇలా = భూమియందునగు, గతి = సంచారముచేత, భ్రాజి యగుచు, క్రమముననే, అర్కనందను = కర్ణునియొక్క, నెత్తిన్ = శిరమునందును, బాహాంతరమునన్ = వక్షస్థలమందును, ఆనఁగన్ = ఆనునట్టుగా, తత్ = ఆకర్ణునియొక్క, బలశ్రేణిమనములు తల్లడిలఁగ, మహాశుగంబులవాన = బాణవర్షమును, కురిసెను.
| సీ. | అరికిన ట్లగపడి యనిషేధనీయమా | |