రామ. విమాక్తికీకృతములైన విరోధివధూకుచములు గలవాఁడా! కుంభకర్ణ - సంబుద్ధి. తత్ = ఆమునుపటిదైన, దశ = అవస్థచేత. నిద్రచేత ననుట. వాసరంబు లూరక చనఁజేసితివి. కడమ సరి.
| చ. | నరుఁ డని లెక్క సేయఁడు మనంబున శాత్రవు నమ్మహాత్ముచే | 193 |
రామ. నరుఁడని = మనుష్యుఁడని, మననాయకుఁడు = రావణుఁడు, నిద్దుర = నిద్రను, మునుమున్నుగాఁ దెలిపి, భీష్మ = భయంకరమైన, హానిచేత. కడమ సులభము.
భారత. నరుఁడు = అర్జునుఁడు, అనిన్ = యుద్ధమందు, శాత్రవుని లెక్కసేయఁడు = ఎటువంటి శత్రువునైనఁ దృణీకరించుననుట. మననాయకుఁడు = దుర్యోధనుఁడు, ఇద్దురమును = ఈయుద్ధమును, మున్నుగాఁ దెలిపి ని న్నెటులైన, యుద్ధమునకుఁ దోడుకరాక, భీష్మునియొక్క హానిచేత దుర్బలుఁ డయ్యెను. కడమ సరి.
| వ. | అని మఱియుం దమదొరలచావు లుగ్గడించి యివి యన్నియు మన | 194 |
రెంటికి సరి సులభము.
| సీ. | ప్రత్యర్థిభద్రవారణఘటోత్కచలస | |
| తే. | దివసనాయకుపట్టిపైఁ గవిసి తత్ప్ర | |