Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నుక్కు మడఁగఁ దత్తద్ద్వంద్వయుద్ధవిధిని
బిరుదు లై రిపు లడఁచుచుఁ బేర్చు టరసి.

188

భారత. తెలివి చేకొని = మూర్ఛ దెలిసి, అతఁడు = దుర్యోధనుఁడు, తనయొక్క యోధవీరవరులను దత్తద్ద్వంద్వయుద్ధవిధిచేత, రిపులు = పాండవులు, ఆడఁచుచుఁ బేర్చుట = జయించుట ననుట. అరసి = చూచి, పనిచెనని ముందరిపద్యమునఁ గ్రియ.

రామ. తెలివి చేకొని = వివేకము దెచ్చుకొని, అతఁడు = రావణుఁడు. కడమ సులభము

వ.

ప్రతివిధానం బన్వేషించి.

189


ఆ.

అతివిశాలదృతిమహాద్రినిభానుజు
బహురణప్రయత్నభరవినిద్రుఁ
జేసి యరులత్రుళ్లు చెఱుపఁ బంచెద నని
యాత్మ నెంచి యతని నట్ల పనిచె.

190

రామ. అతివిశాలధృతి గలవాని, అద్రినిభుఁడైన, అనుజున్ = కుంభకర్ణుని, బహురణ = పెక్కుమ్రోఁతలయొక్క, “రవే రణః” అని అ. ప్రయత్నభరముచేత, వినిద్రున్ = మేల్కొన్నవానిఁగా, చేసి, అట్ల = ఆయెంచినప్రకారముననే, పనిచెను.

భారత. అతివిశాలధృతిచేత, మహాద్రిని = అద్రిని బోలినవాని, భానుజున్ = కర్ణుని, రణ = యుద్ధముయొక్క, ప్రయత్నభరమందు, నిన్నిద్రున్ = జాగరూకుని, చేసి పనిచెను.

వ.

పనిచిన నతండును నతిభయంకరసన్నాహంబుతోడ నాహవక్రీడకు
నురువడించె నప్పుడు తత్పరివారంబు.

191

రెంటికి సరి సులభము.

చ.

ప్రకటత నేఁడు నీ వనిభరంబు వహించితె కించిదంచిత
భ్రుకుటివిమాక్తికీకృతవిరోధివధూకుచకుంభకర్ణ యా
జి కిటులు భీష్మరోషమునఁ జేరక తద్దశ వాసరంబు లూ
రక చనఁ జేసి తక్కట తిరంబుగ మమ్మిక నైనఁ గావవే.

192

భారత. పరివారము కర్ణునితో ననెడుమాట. కించిదంచితమైన, భ్రుకుటి = బొమముడిచేతనే, విమాక్తికీకృత = హారవిరహితములుగాఁ జేయఁబడిన, విరోధివధూ = శత్రుస్త్రీలయొక్క, కుచకుంభములు గలవాఁడా! కర్ణ - సంబుద్ధి. భీష్మునియందలి రోషమున, తత్ = ఆభీష్మునియొక్క, దశవాసరంబులు = యుద్ధదినములు పదింటిని, చనఁజేసితివి, ఇఁక నైనఁ గావవే.