| | సప్రగల్భరామావరజప్రయుక్త | 179 |
రామ. మదిలోను, అమిత్రాస్తమయ = శత్రునాశమందుఁ గల, కాంక్ష = అపేక్ష, మిక్కిలి, కలిమిన్ = కలిగియుండుటచేత, తద్దిశన్ = ఆలక్ష్మణుఁ డుండెడుదిక్కున, అంబకప్రయుక్తి = బాణప్రయోగమును, తత్కాల = ఆయుద్ధకాలమందు, చాపలోప = విల్లువోవుటచేత, హతమైన, యాత్మరక్షణుండగువాని, ప్రచురబంధు = అధికబంధువయిన, సింధురాజును = సముద్రుఁడు గలవాని, బలోర్జితుని, మేఘనాదగురున్ = రావణుని, “అనచిచ” యనుసూత్రమున భారతార్థమందును న్యక్రియాశబ్దాదిని నకారపుఁబొల్లున్నది. న్యక్రియా = రావణునిచేతి తిరస్కారమును, అసహ = ఓర్వని, క్రూరములునై, భీమ = భయంకరములు నయిన, సేనా = వానరసేనలయొక్క, అతిమాత్రోరు = మిక్కిలివిరివియైన, సింహనాదములచేతఁ, అతివిశ్రుతంబుగన్ = మిక్కిలిఁ బ్రసిద్ధమగునట్టుగా, ఆక్రమించి, సప్రగల్బుఁడైన, రామావరజ = లక్ష్మణునిచేత, ప్రయుక్త = ప్రయోగింపఁబడిన, విజయమందు, పటు = సమర్థములైన, శరములయొక్క వ్యాపారవిలసనంబు, ధృతిన్ =నరావణుని ధైర్యమును, సమయించెను.
భారత. మిత్ర = సూర్యునియొక్క, తద్దిశన్ = సూర్యాస్తమయదిక్కునందు, అంబకప్రయుక్తి = దృగ్వ్యాపారమును, “అంబకం నేత్ర శరయోః” అని వి. తత్కాలమందలి చాపలముచేత, ఉపహత = చెఱుచుకోఁబడిన, ఆత్మరక్షణ గలవాఁ డగువాని, ప్రచురబంధున్ = ప్రచురబంధువులు గలవాని, సింధురాజును = సైంధవుని, మేఘనాద = "మేమధ్వనియొక్క; గురున్యక్రియా = అధిక తిరస్కారమందు, సహ = సమర్థములునై, క్రూరములునైన భీమసేనునియొక్క, సింహనాదముల చేత నాక్రమించి, ధృతిన్ = సంతోషముచేత, “ధృతిర్యోగాంశరే ధైర్యే ధారణాధ్వరతుష్ఠిషు ” అని వి. పాకభేదిముఖ్యఖేచరులు = ఇంద్రాదిదేవతలు, మెచ్చఁగా, రామావరజ = కృష్ణునిచేత, ప్రయుక్త = ప్రేరేపఁ`బడిన, విజయునియొక్క పటుశరవ్యాపారవిలసనంబు, సింధురాజును సమయించెనని యన్వయము.
| తే. | సరగున బునఃప్రకాశితచండధాముఁ | 180 |
భారత. పునఃప్రకాశిత = తిరుగాఁ బ్రకాశింపఁజేయఁబడిన, చండభీముఁ డగుచున్ = సూర్యుఁడు గలవాఁడై, అసురకులవైరి = కృష్ణుఁడు, కడమ సులభము.