Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. హరులు = గుఱ్ఱములు, అనిన, కీలాలములు వెల్లిగొనునట్టుగా, అవనిన్ = భూమిని, శాత = వాఁడియైన, అస్త్రనిహతి = బాణప్రయోగముచేత, గ్రొచ్చి = భేదించి, వాజితృష్ణ = గుఱ్ఱాలయొక్క దప్పిని, వారించెను.

రామ. హరులు = వానరులు, దగదొట్టి, అనిన్ = యుద్ధముందు, మెలఁగలేవు. క. 'స్థావరతిర్యక్పదముల, కేవెరవునఁ గ్రియలు దలఁప నేకవచనముల్, దేవమనుష్యాదిక్రియ, భావింపఁగ నేకవచనబహువచనంబు' అని యాంధ్రభాషాభూషణము గనుక హరులు మెలఁగలేవని ప్రయోగము. నవమైన, అజితృష్ణన్ = తిరుగ యుద్ధము సేతు ననెడుకాంక్షను, వారించెను = అణఁచెను. ఈయతిప్రతాపుఁడు = రావణుఁడు, అత్యద్భుతంబుగన్ = నాకును వెరఁగవునట్టుగా, నవ = వింతలై, నిశాత = తీక్ష్ణములునైన, అస్త్ర = దివ్యాస్త్రముయొక్క, వానరప్రయుక్తపర్వతములనన్నియు నుగ్గుచేసినవి గనుక, నిహతిన్ = ప్రహారముచేత, క్రొచ్చి= గుదులుగా వ్రేసి, కీలాలములు = నెత్తురులు, “శోణితేంభసి కీలాల” మ్మని అ. వెల్లిగొన వెలార్చి, సరిలేక వారించె నని క్రిందటి కన్వయము.

సీ.

మును పిమ్మహాయోధుఘనసంగరోత్సాహ
           సన్నాహసంపత్తి విన్నది మొద
లాప్తసేనాదిసహాయసంగత్యవి
           రతినిబిడౌజుండు రాజరాజు
సింధురాజుబ్రదుకు సెడకుండ రక్షించు
           కొనుటకు నతియత్నమునఁ బరఁగుట
దెలిసియు నిబ్బలాధికుని జయద్రథు
           సద్యోవధార్దునిఁ జంపుటకును


తే.

బ్రతినయం బే నొనర్పక పార్థబాణ
ములనె ప్రొద్దు గ్రుంకెడుదాఁకఁ బోరు జరుపు
చున్న విజయహాని జనింపకున్నె యకట!
శత్రునకు దర్పకాల మై సత్త్వ మెక్క.

175

రామ. మునుపు = పూర్వమందు, ఇమ్మహాయోధు = రావణునియొక్క, సంగర = యుద్ధమందుగల, అవిరతిని = ఎడతెగకుండుటచేత, బిడౌజుండు = ఇంద్రుఁడును, రాజరాజు = కుబేరుఁడును, సింధురాజు = వరుణుఁడును, అతియత్నమునఁ బరఁగుట = ప్రచ్ఛన్నులై యుండుటననుట. తెలిసియు, జయత్ = సర్వోత్కృష్టత్వమున వర్తింపుచున్న, రథున్ = రథము గలవాని, సద్యోవధార్హునిన్ = ప్రొద్దు గ్రుంకకమునుపే చంపఁదగిన రావణుని, చంపుటకు, ప్రతినయంబు = యుక్త్యంతరమును, ఒనర్పక, అపార్థ = నిరర్థకము