బును, కుంటువడనేయన్ = తెగవ్రేయఁగా, అరతన్ = సమీపమున, నటించు = నటించెడి, చక్రి = కృష్ణుఁడు, మోదించెను. ఈ పద్యమునందును గరము కుంటుపడునట్టు లరిని నేయనని యన్వయింపఁదగు.
| వ. | మఱియుం దద్రణం బతిభయంకరం బయి ప్రవర్తిల్లె. | 171 |
రెంటికి సరి సులభము.
| ఉ. | అంతట రాముతమ్ముఁడు దిగంతసమీపగుఁ డైనయట్టిభా | 172 |
భారత. రాముతమ్ముఁడు = కృష్ణుఁడు, భాస్వంతు = సూర్యునియొక్క, తెఱంగు గాంచి, ఇంతటినుండి యర్జునవ్యాపారము. జిష్ణుని = అర్జునుని, రిపు = కర్ణాదులయొక్క, సత్త్వమును నారయుచు, తనలో ననుకొనుమాట, కడమ సులభము.
రామ. రాముతమ్ముఁడు = లక్ష్మణుఁడు, భాస్వంతుతెఱంగు = రక్తవర్ణము ననుట, కాంచి = పొంది, శత్రుని = రావణునియొక్క, కాయము సొంపుమీఱఁగాన్ = శరీరము రక్తమయమగునట్టు గాననుండి, జిష్ణురిపు = రావణునియొక్క, సత్త్వము నారయుచును మనంబున లక్ష్మణుఁ డెంచుకొనెడుమాట.
| తే. | సమదరోషాహితుల ఘోరసాయకముల | 173 |
రామ. సమదరోషాహి = క్రూరసర్పములే, తుల = పోలికగాఁగల, ఘోరసాయకములచేత, వానరానీకమును = వానరసమూహమును, భానుసుతాది = సుగ్రీవుఁడు మొదలయిన, అరాతి = రావణునియొక్క. కడమ సులభము.
భారత. సమదరోషాహితుల = క్రూరశత్రువులయొక్క , సాయకములవాన = బాణవర్షమును, రానీక, నర = అర్జునునియొక్క, అతివిపుల, కొదగానన్ = కొదవఁ గానను.
| తే. | హరులు దగదొట్టి మెలఁగ లే వనినవాజి | 174 |