భారత. పరుసపుమాటలు, అరు = అనెడి, దహనముయొక్కయు బాణముయొక్కయు హతిచే నొంచి విడిచెను, నికటంబునన్ = ఆసమీపముననే, రిపుస్ఫురణ = భూరిశ్రవసుప్రతాపముచేత, కృశ = క్షీణములైన, అనుజక్రియలు = సాత్యకిచేష్టలను, చూచుచు, రాముని = బలరామునియొక్క, తమ్ముఁడు = కృష్ణుఁడు, కడమ సులభము.
| వ. | ససంభ్రమాకులుం డై. | 168 |
| తే. | చూడు మటు నరవరజయస్ఫూర్తి నార్చె | 169 |
భారత. కృష్ణుం డర్జును ననుమాట. చూడు మటు, నర = అర్జునా! భూరిశ్రవః = భూరిశ్రవసునియొక్క, దారుణమైన, రణమహిన్ = యుద్ధభూమియందు, మదనుజ = నాతమ్ముఁడయిన సాత్యకియొక్క, బలశ్రీలు, మడఁగన్క్ = అణఁగిపోఁగా, వైరిసేన, యార్చెను. ఇంతటను, రిపు = శత్రువైన భూరిశ్రవసునియొక్క, కరంబు = హస్తమును, తెగవ్రేయకునికి కీడు.
రామ. లక్ష్మణుఁడు రామునితో ననెడుమాట. నరవర-సంబుద్ధి. భూరి= అధికమునై, శ్రవోదారుణ = శ్రవణభయంకరమైన, రణ = శబ్దముయొక్క, “రణో స్త్రీయుధినా ధ్వనా” అని రత్నమాల. మహిమన్ = ఆధిక్యముచేత, వైరిసేన, ఆర్చెను = మ్రోసెను. దనుజబల = రాక్షసబలముయొక్క, శ్రీలు = విలాసములు, మడఁగన్ = అడఁగునట్టుగా, రిపున్ = రావణుని, కరంబు మిక్కిలి, తెగవ్రేయకునికి కీడు, వ్యాఖ్యయందుండు క్రమమునకు లక్షణ మిమడదని తోఁచునెడ కరము దెగునట్టు శత్రుని వ్రేయకునికి కీడని యన్వయింపనగు.
| తే. | అనుచుఁ దా నన్నమాటఁ జేకొని తడయక | 170 |
రామ. అనుచుఁ దాను, అన్నమాటను, రామునిమాటను, చేకొని = అనుమతిఁ బుచ్చుకొని యనుట. సుమిత్రయొక్క నందనుఁడు = లక్ష్మణుఁడు, నరతను = మనుష్యత్వమున, నటించు చక్రి = రాముఁడు, కడమ సులభము.
భారత. అనుచు, తా నన్నమాటను = తా నాడినమాటను, చేకొని, సుమిత్రనందనుఁడు = బంధుప్రియుఁడు, జిష్ణుఁడు = అర్జునుఁడు, అరి = భూరిశ్రవసునియొక్క, కరం