Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. సార = శ్రేష్ఠమైన, నిజచాపగుణముయొక్క శబ్దమును, సమనువ్రప్రజ్యా = వెనుకొనుటకు, రసిక = నేర్పరియునై, శూరకర = శూరశ్రేష్ఠుఁడైన, సాత్యకియొక్క, రణాగ్ర = యుద్ధముఖమందువు, క్రూర = నిష్ఠురములయిన, శర = బాణములయొక్క, శాత్కృతి = శతృధ్వనులచేత, నిరూప్య = తెలియఁదగిన, గమనము గలవాఁడై చేరి, అవికారమైనధృతి గలవాని, సింధునృపున్ = సైంధవుని, చూచెను, తనబాణప్రయోగధ్వనులజాడను సాత్యకియుఁ గొల్చి రాఁగా నర్జునుఁడు సైంధవుని గదిసె ననుట.

రామ. సారనిజచాపగుణశబ్దమును, సమనువ్రజ్యా = వెనుకొనుటకు, రసిక = రుచి గలవియునై, శూరులయొక్క, తరస = మాంసములచేత, అతి, మిక్కిలి, అకిరణ = కిరణరహితములైన, అగ్ర = ముల్కులు గలవియునైన, శత్రుమాంసములచేతఁ గప్పఁబడినవి యనుట, క్రూరశరములయొక్క శాత్కృతులచేత, నిరూప్య= ఎఱుఁగఁదగిన, గమనుండై = గమనము గలవాఁడై, అవికారధృతిచేత, సింధుసముద్ర మైనవాని, నృపున్ = రాముని, చూచెను.

వ.

అంత.

159


తే.

తివిరి గురుకృతవరాదిధృతివిలసిత
విగ్రహస్ఫూర్తిఁ గడు మించి విజయసత్స
హాయతాలోలుఁ డయి వచ్చు నలఘునున్యు
దశముఖుని భీము నర్కనందనుఁడు దాఁకె.

160

రామ. తివిరి, గురు = అధికమౌనట్టుగా, కృత = చేయఁబడ్డ, వర్మాది = కవచము మొదలుగాఁ గలసాధనములయొక్క, ధృతి = ధారణముచేత, విలసితమైన, విగ్రహ = శరీరముయొక్క, “శరీరం వర్ష్మవిగ్రహః” అని అ. స్ఫూర్తిన్ = స్ఫురణచేత, విజయ = గెలుపే, సత్సహాయతా = లెస్స సహాయముగాఁ గలవాఁ డౌటచేత, అలోలుఁడయి = అచలుఁడై భయము లేక యనుట, వచ్చుచున్న, అలఘుమన్యున్ = అధికకోపము గలవాని, భీమున్ = భయంకరమైనవాని, దశముఖునిన్ = రావణుని, అర్కనందనుఁడు = సుగ్రీవుఁడు, తాఁకెను.

భారత. తివిరిగురుకృతవర్మాదులయొక్క, ధృతి = ధైర్యముచేత, విలసితమైన, విగ్రహ = యుద్ధముయొక్క, స్ఫూర్తిచేత, “రణః కలహవిగ్రహౌ" అని అ. విజయ = అర్జునునియొక్క, సహాయత్వమందు, లోలుఁడై = అపేక్ష గలవాఁడై, "లోలశ్చలనతృష్ణయోః” అని అ. అర్జునునికి సహాయముగా ననుట, అలఘు = అధికమైన, మన్యుదశ = రోషావస్థ గల, ముఖము గలవాని, భీమున్ = భీముని, అర్కనందనుఁడు = కర్ణుఁడు, తాఁకెను.