భారత. సారథ్యముయొక్క యాశ్చర్యచర్యామహిమచేత మహనీయమైన, రణవిహరణమందుఁగల, రణరణిక = కాంక్షాతిశయముయొక్క యనుట, బంభ్రమ్యమాణ = మఱిమఱి పరిభ్రమించుచున్న, శరప్రయోగవేగచాతుర్యముచేత, నాశ్చర్యమైన, దశ = అవస్థగల, భుజయుగయుగళ = పూనుగాండ్లవంటి రెండుభుజములయొక్క, కడమ స్ఫుటము.
రామ. హరికుంజర = వానరశ్రేష్ఠులయొక్క, శతములయొక్క, సార= శ్రేష్ఠమైన, ధీ = బుద్ధికి, ఆశ్చర్యమైన, చర్యా = గతియొక్క, దశభుజయుగయుగళ = వింశతిహస్తములయొక్క, కడమ సరి.
| క. | వేమఱు మనగుర్వశ్వ, త్థామలకీఘోరవీరతరుబాణకదం | 154 |
రామ. మన = మనయొక్క, గురు = వ్రేఁగైన, అశ్వత్థ = రావి, ఆమలకీ = ఉసిరిక, “తిష్యఫలాత్వామలకీత్రిషు” అని అ. వీరతరు = మద్ది, “నదీసర్జోవీరతరురింద్రద్రుఃకకుభోర్జునః” అని అ. బాణ = గోరంట, “నీలీఝింటీద్వయోర్బాణః" అని అ. కదంబ = కడిమి, “నీపప్రియకకదంబాస్తుహలిప్రియే” అని అ. ఈచెట్లయొక్క, అమితవర్షము = చాలఁ బ్రయోగించుట, దుఃస్తరమై = తరింపరానిదై, మెఱసెను, ఇతండును = ఈరావణుఁడును, తత్ = ఆతరువర్షముచేత, అప్రభేద్యుఁడయ్యెను, అని పలుకుచుండ నని ముందరి కన్వయము. "ఆమలకీ” అనుశబ్దమున ఆ యనెడు నుపసర్గ మున్నది గనుక యతిస్థానమునకు తకారమే చెల్లును. ఇది ప్రాదియతి - ఇందుకు లక్షణము. కవిలోకచింతామణి యనెడు తాతంభట్టుఛందమందు, ఆ. 'ధాత్రిఁ బ్రాదియోగమాత్రంబు గలిగిన, నుభయమును వచింప నొనరు యతికి, సాతిరిక్తభక్తిశక్రసేవితకమ, లాలయానివాస లక్ష్య మిదియె' ఇందుకు విరాటపర్వమందు సోమయాజి, ఉ. 'శ్రీయన -గౌరినాఁ బరఁగుచెల్వలచిత్తము పల్లవింప భ, ద్రాయితమూర్తియై హరిహరం బగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక, ధ్యాయితకిచ్చ మెచ్చుపరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్' హరివంశమందు నాచన సోమనయు, క. 'ఆపాదశిరోలంకా, రాపాదితచారుతాభిరామాత్త్యమహా, రూపాలోకనతుష్టా, కూపారకుమారికాముకురమణిరాజా.' ఇట నుదాహరించినది గనుక, అశ్వత్థామలకీఘోరవీరతరు - అని తకారమే యతిగా సూరపరాజుగారును బ్రయోగించినారు.
భారత. గుర్వశ్వత్థామలకున్ = ద్రోణాశ్వత్థామలకును,ఈవీరతరు = వీరశ్రేష్ఠుఁ డైనయీయర్జునునియొక్క, బాణకదంబ = బాణసమూహములయొక్క, అమితవర్షము మెఱసెను, ఇతండున్ = అర్జునుఁడును, తత్ = ఆబాణవర్షముచేత, ఆప్రభేద్యుఁ డయ్యెన్ = భేదింపరానివాఁ డాయెను.