Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బునఁ దత్తదహితనృపవ
ర్తనచింతం గినుక బలిసిరాఁ దనలోనన్.

147

రెంటికి సరి సులభము.

ఉత్సాహ.

ఆదుకొన్న కావరమున నకట మనుజమాత్రుఁ డీ
మేదినిపయి సింధురాజు మీఱి వచ్చి భీమసే
నాదిబహుసహాయచయము నాఁగి చెఱుచువాఁడె హా
నాదుపట్టినట్టిచలమునన్ గణింపఁ డేమియున్.

148

భారత. సింధురాజు = సైంధవుఁడు, సహాయచయమును, ఆఁగి, నాదుపట్టిన్ = అభిమన్యుని, చెఱుచువాఁడె = కూల్చువాఁడే.

రామ. సింధురాజున్ = సముద్రుని, మీఱివచ్చి భీమమైన సేనాదిబహుసహాయచయమును జెఱుచువాఁడె, నాదుపట్టినట్టి = నేఁబట్టిన, చలమును, నన్ = నన్నును, గణింపఁడు.

వ.

అని యుగ్గడించి యందుల కేమి యన్నియుం జిక్కనయ్యెడు ననిరోష
వేగంబున రోఁజుచు నందఱు విన ని ట్లనియె.

149

రెంటికి సమము సులభము.

క.

ధృతి నేన కూల్తు నరిసం
హతిఁ బాఱఁగఁ దఱిమి తఱిమి యాసింధుమహీ
పతితలసద్బలవత్సై
న్యతనూఖండముల జంబుకాదులు దనియన్.

150

రామ. అరిసంహతిన్ = శత్రుసమూహమును, ఆసింధు = సముద్రపర్యంతమైన, మహీజ = భూమియందు, పతిత = పడిన, కడమ సులభము.

భారత. సింధుమహీపతి = సైంధవునియొక్క, తలను గూల్తును.

తే.

వినుఁడు నాపంత మిదె నేఁడు వేగయుక్త
గతి నలిగి యానృపుని నేలఁ గలపువాఁడె
నలినమిత్రునస్తసమయంబునకు మునుపుగ
భానుపుత్త్రాదితత్పరక్షబలముఁ దఱిమి.

151

భారత. మఱియు నర్జునునివాక్యము, నేఁడు, వేగన్ = తెల్లవారినను, నలినమిత్రు = సూర్యునియొక్క, ఆనృపుని = సైంధవుని, కడమ సులభము.

రామ. మఱియు రావణునివాక్యము, వేగయుక్తమయిన గతిచేత, నలిన్ = వేడుకచేత, అమిత్రు = రామునియొక్క, అస్తమయంబునకున్ = నాశనమునకు, మునుపుగ,