Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. మరుత్ = వాయువుయొక్క, వరసుతుఁడు = హనుమంతుఁడు, బలాళి మగుడ, దుర్దమరణమందుఁగల, జయశోభగత్ = జయలక్ష్మి గలది యగునట్టుగా, దత్త = ఇయ్యఁబడిన, మహాశ గలవాఁడు, విఱిగినమూఁక తిరిగి జగడము సేయునట్టుగా నాధారమైనవాఁ డనుట. ఆలమునకున్ = యుద్ధమునకు, ఎదిరించెను.

తే.

తొలఁగ కెడ సొచ్చుమానవాదుల సుశర్మ
యోధులను బాఱఁద్రోలి యి ట్లురుభుజావి
భూతి నెదిరించునాకపికేతను నతఁ
డాజి నొప్పించి మడిసె వాహనముతోడ.

140

రామ. మానవాదులన్ = మనుష్యుల భక్షించెడువారిని, సు = మిక్కిలియు, శర్మ = సుఖ మౌనట్టుగా - అనాయాసముగ ననుట. యోధులను = పోరెడివారిని, పాఱఁద్రోలి = పాఱఁదఱిమి, ఎదిరించెడు, ఆకపికే = ఆహనుమంతునికే, అతఁడు = ఆధూమాక్షుఁ డనెడు రావణుని మూలబలకర్త, తనును, అజిని, ఒప్పించి = అప్పగించి, మడిసెను.

భారత. మానవాదులన్ = మానములఁ బలికెడువారిని - పంతము లాడువారి ననుట, సుశర్మయోధులను = = సంసప్తకులను, ఆకపికేతను = అర్జునుని, అతఁడు = భగదత్తుఁడు, నొప్పించి, వాహనముతోడన్ = ఏనుఁగుతోఁగూడ, మడిసెను.

వ.

మఱియును.

141


క.

బహురక్షోభయసేనలు, విహితాజిని ద్రెళ్ల నంత విలసిల్లె జగ
న్మహితాహవరుచిరక్షి, ప్రహస్తకోదండగురుతరస్ఫూర్తి గడున్.

142

భారత. బహురక్ష గలయుభయసేనలు, జగన్మహిత = జగత్ప్రసిద్ధమైన, ఆహవమందు, రుచిర = ప్రకాశింపుచున్న, క్షిప్ర = వేగవంతమైన, హస్తము గల, కోదండగురు = ద్రోణునియొక్క, తరః = బలిమియొక్క, స్ఫూర్తి విలసిల్లెను.

రామ. బహురక్షస్సులయొక్క, అభయ = భయరహితములైన, రుచి = వేడుకను, రక్షి= రక్షించెడి, ప్రహస్త = రావణునిసేనాపతి యైన ప్రహస్తునియొక్క, కోదండముచేత, గురుతరమైనస్ఫూర్తి విలసిల్లెను.

సీ.

ఆమేటి తనదుసైన్యమును బద్మవ్యూహ
           భంగిఁ జూపెట్టంగఁ బన్నిహతిక
రప్రహారప్రవర్తనలచేఁ జీకాకు
           వఱుచుచుఁ గడుఁ జొచ్చి నుఱిచియాడు
వీరకుంజరు జగద్వినుతవిక్రము ధనం
           జయతనూజు సుభద్రసంతతి నవ