Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అప్పుడు.

135


క.

అత్యంతము నవనిసుతా
పత్యతనుబలంబులోన బస మీఱి మహా
దైత్యుఁ డనఁబరఁగు శూర
స్తుత్యుఁ డసమరోషవికృతి ధూమ్రాక్షుఁ డనిన్.

136

భారత. అవనిసుత = నరకాసురునియొక్క, అపత్యతను = పుత్త్రత్వముచేత, పరఁగు శూరస్తుత్యుఁడు = భగదత్తుఁడు, అసమరోషముయొక్క వికృతిచేత ధూమ్రవర్ణములైన, అక్షుఁడు = కన్నులు గలవాఁడు, చరించెనని ముందరిపద్యమునఁ గ్రియ.

రామ. అవనిసుతాపతి = రామునియొక్క, అతను = అనల్పమైన, బలంబులోన, అసమమైన రోషవికృతి గలవాఁడు, ధూమ్రాక్షుఁడు, కడమ సరి.

తే.

దళితహరికుంజరశతాంగములు ధరిత్రిఁ
గప్పుచు యథామనోరథగతిఁ జరించె
నవనిజారూఢమదవారణక్రియలకు
నిలువలేక పార్థబలయోధులు దొలంగ.

137

రామ. దళిత = భేదింపఁబడిన, హరికుంజర = వానరముఖ్యులయొక్క, శతములయొక్క యంగములచేత, యథామనః = మనసు నతిక్రమింపని, అవ్యయీభావసమాసము. రథగతిచేత, నిజ = తనయొక్క, ఆరూఢ = దృఢమైన, మదముయొక్క, వారణక్రియలకున్ = పోమొత్తుటలకు, నిలువలేక యపార్థబలులైన యోధులు తొలంగ, చరించెను.

భారత. హరికుంజరశతాంగములు = రథాదులచేత, నిజారూఢమైన, మదవారణమత్తేభముయొక్క, క్రియలు = యుద్ధక్రియలకు, పార్థబల = ధర్మరాజుసేనయందుఁ గల, యోధులు తొలంగ, యథామనోరథగతిన్ = యథేష్టవృత్తిచేత, చరించెను.

వ.

అంత నంతయుం గనుంగొని.

138


క.

తమకమున మరుద్వరసుతుఁ, డమితవ్యధఁ జెదరు నిజబలాళి మగుడ దు
ర్ధమరణజయశోభగద, త్తమహాశుండాలమునకుఁ దా నెదిరించెన్.

139

భారత. మరుద్వర = ఇంద్రునియొక్క, “మరుతౌ పవనామరా” అని అ. సుతుఁడు = అర్జునుఁడు, దుర్దమ = అణఁపశక్యముగాని, రణజ = యుద్ధమువల్లఁ బుట్టిన, యశము గల భగదత్తునియొక్క, మహాశుండాలమునకు = సుప్రతీకమనెడి గజమునకు, ఎదిరించెను.