Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. వరశక్తి గలవాని, ప్రబలునిన్ = భీష్ముని, శాలి = ఒప్ఫెడువాఁడు, చమూసంతతి గలవాఁడు, విజయుండు, అర్జునుఁడు, శిఖండి, ఏసెనాన్ = వ్రేసె ననఁగా, రచితమైన, మర్మ = ఆయములుగల, తను = శరీరము గలవాని, చేసి, గురు = అధికమైన. కడమ సమము.

క.

దీనతఁ దత్ప్రతిపక్షబ
లానీకము గుందుచుండె నారాత్రిఁ గడున్
మానసము లార్తిఁ బొగులం
గా నిఁక నేదిబ్రతు కేదిగతియో యనుచున్.

131

ఉభయసమము.

ఉ.

అంతట నద్భుతంబు గరుడాగమనంబు నిరాకృతాహితా
త్యంతసమార్జితోర్జితజయాభ్యుదయం బయి భీష్మపాతసం
క్రాంతఘనవ్యధ న్నెఱయఁ గా మఱపింపఁ బునర్మహాజివి
క్రాంతి కుపక్రమించువిభుఁ గాంచి దినేశసుతాదు లుబ్బుచున్.

132

భారత. ఆద్భుతంబుగ, రుట్ = రోషముయొక్క, "ప్రతిఘారుట్క్రుధౌ స్త్రియా” మ్మని అ. ఆగమనంబు నిరాకృతమైన యహితులచేత నత్యంతము, సమార్జిత = సంపాదింపఁబడిన, ఊర్జితమైన జయాభ్యుదయము గలదై, కోపించి శత్రుజయాతిశయమును నిరాకరించె ననుట, భీష్మపాతముచేత, సంక్రాంత = సంక్రమించిన ఘనవ్యధను మఱపింపఁగాఁ బునర్మహాజియందుఁ గల, విక్రాంతికి = విక్రమమునకు, దినేశసుతాదులు = కర్ణాదులు, సంభ్రమించిరి అని ముందరివచనమునఁ గ్రియ. కడమ సులభము.

రామ. అద్భుతమయిన గరుడాగమనంబు, నిరాకృతాహితా = విడిపింపఁబడిన సర్పములు గలదౌటచేత, ఊర్జితజయాభ్యుదయంబయి = గెలుపునందలియుబ్బును రప్పించి యనుట. భీష్మ = భయంకరమైన, పాత = పాటుచేత, దినేశసుతాదులు = సుగ్రీవాదులు, కడమ సమము.

వ.

చేరి పొడగాంచి ప్రస్తుతసమరసన్నాహసముచితప్రకారంబున సంభ్ర
మించి రంత నరుణోదయం బగుటయు.

133

రెంటికి సరి సులభము.

క.

గురురక్షోర్జితదర్ప, స్ఫురణముచే శత్రుసైన్యములు మార్కొనఁ జె
చ్చెర వైవస్వతసంతతి, నరవరుఁ డొగి నద్దుర మ్మొనర్చె సబలుఁ డై.

134

రామ. గురు = ఆధికమైన, రక్షస్సులచేత, ఆర్జిత = సంపాదింపఁబడిన, దర్పస్ఫురణముచేత.

భారత. గురు = ద్రోణునియొక్క, రక్షచేత నూర్జితమైన, కడమ సరి.