Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరగున దాని మాన్పహరిచక్రముఁ బూని యెదిర్చె నంతనే
మరలె నరాతియత్నగరిమం దనపూఁపు నివారితంబుగన్.

128

భారత. హరి = కృష్ణుఁడు, చక్రముఁ బూని యెదిర్చెను, అంతనే = ఆప్పుడే, నర = అర్జునునియొక్క, అతియత్నగరిమను ప్రార్థనచే ననుట. మరలెను.

రామ. హరిచక్రము = వానరసమూహము, అరాతి = శత్రువైన ఇంద్రజిత్తుయొక్క, యత్నగరిమను = బాణప్రయోగాదియత్నములచేత, మరలెను = ఓర్వలేక వెనుక తీసెను. కడమ సులభము.

వ.

అంత.

129


సీ.

అ ట్లవార్యప్రౌఢి నలరుపితామహు
           వరశక్తిఁ బ్రబలుదీవ్యత్ప్రతాప
గుణశాలి విజయుండు కోదండఘననాద
           సంపదుల్లాసితసకలనిజచ
మూసంతతిశిఖండి యేసె నారచితస
           చ్ఛదసంగ్రామప్రచారుఁ డగుచు
వైరినృపాలకుమారులహృదయంబు
           లెంతయు భేదిల్ల నిద్ధవివిధ


ఆ.

విశిఖవిసరనిబిడవిద్ధసమస్తమ
ర్మతను జేసి యుద్ధమహిఁ బడంగ
నేసి గురుమనోవికాససంపాది యై
యాప్తబంధుజనుల నలరఁజేసె.

130

రామ. పితామహు = బ్రహ్మయొక్క వరముయొక్క శక్తిచేతఁ బ్రబలెడి, దీవ్యత్ = ప్రకాశించుచున్న, ప్రతాపగుణములచేత, శాలి = ఒప్పుచున్న, విజయము గలవాఁడు, కోదండ మనెడి, ఘన = మేఘముయొక్క, నాదముయొక్క, సంపత్ = సమృద్ధిచేత, ఉల్లాసిత = సంతోషింపఁబడిన, సకలనిజచమూసంతతి యనెడి, శిఖండి = నెమళ్లు గలవాఁడు, ఆరచితమైన, సచ్ఛద్మ = కపటముతోఁ గూడిన, సంగ్రామప్రచారము గలవాఁ డగుచున్ - మేఘములలో నుండి యనుట. ఇద్ద = ప్రవృద్ధములునై, వివిధములైన, విశిఖ = బాణములయొక్క, విసర = సమూహములచేత, “సందోహవిసరవ్రజాః” అని అ. నిబిడ మౌనట్టుగా, విద్ధ = భేదింపఁబడిన, సమస్తమర్మతను = సకలమర్మస్థానములు గలవాఁడౌటను, చేసి = మర్మములు భేదించి యనుట. గురు = రావణునియొక్క, కడమ సులభము.