| వ. | అంత. | 126 |
| సీ. | సింజినీనిర్ఘోషజితసముద్రధ్వని | |
| తే. | నాగభీషణబాణప్రయోగములను | 127 |
రామ. సింజినీనిర్ఘోష = గుణధ్వనిచేత, "మౌర్వీ జ్యా సింజినీ గుణః" అని అ. జితమైనసముద్రధ్వని గల, మేఘనాదుండు = ఇంద్రజిత్తు, సమిద్ధ = ప్రకాశింపుచున్న, శక్తిచేత, భీష్ముండు = భయంకరుఁడు, సందీప్తములయినప్పడు శౌర్యగుణము లనెడు మణులకు, వాహినీశుండు = సముద్రునివంటివాఁడు, నిజాహవదశ = స్వకీయయుద్ధావస్థగల, దివసాంత = రాత్రియందు, రచితమైన, నాగ = నాగరూపములైన, భీషణబాణప్రయోగములను, నాగపాశములచే ననుట, భీమ = ఘోరములైన, నరవర = రామునియొక్క, చేష్టలు, తదనుజు = లక్ష్మణునియొక్క, లసత్ప్రతాపంబు లొదుగువడఁగ, కట్టుపఱిచెను.
భారత. సింజినీనిర్ఘోషముచేత జితము లైనసముద్రధ్వనియు మేఘనాదములును గలవాఁడు, పృథు = మనములైన, శౌర్యగుణమణి = మణులవంటి కార్యగుణములు గలవాఁడు, శౌర్యగుణభూషితుం డనుట, వాహినీశుండు = సేనాపతి, భీష్ముండు, నిజాహవ = తనయుద్ధముయొక్క, దశదివసాంతర = పదిదివసములలోపల, చిత = సంపాదింపఁబడిన, తీవ్ర, విక్రమతను = విక్రమముగలవాఁ డౌటచేత, నాగ = సర్పములభంగిని, భీషణములైన బాణప్రయోగములచేత, భీమునియొక్కయు నరునియొక్కయు, చేష్టలు, తదనుజుల = నకులసహదేవులయొక్క, ఆజిని = యుద్ధమందు, పల్మఱుఁ గట్టుపఱిచెనని క్రిందటి కన్వయము. కుంటుపఱిచె ననుట.
| చ. | దొర ననుజాన్వితంబుగ సుదుర్దమదుర్దశఁ గుందఁజేసి యి | |