శతబలి, సమీరణసుత = హనుమంతునియొక్కయు, ఆజికేళీ = యుద్ధవిలాసముయొక్క, మహత్త్వము = ఆధిక్యమును, ఈక్షించుచు, సంపాతి = సంపాతియొక్కయు, దస్రసుత = మైందద్వివిదులయొక్కయు, ఆచ్ఛభల్లరాజ = భల్లూకపతియైన జాంబవంతునియొక్కయు, “ఋక్షాచ్ఛభల్లభాలూకాః" అని అ. వేగదర్శియొక్కయు, తను = శరీరములయొక్క, దర్పంబు = బలిమిని, చూడ్కుల కొసఁగుచున్ = చూచుచును, ఉత్తమ = శ్రేష్ఠమైన, ఓజు = తేజస్సుగలవాని, పర = శత్రువులయొక్క, అను = ప్రాణములనెడి, ఫణి = సర్పములకు, శిఖండి = నెమలియైనవాని, సైన్యేశున్ = సేనాపతి యైననీలుని, కనుఁగొంచు, ద్రు = వృక్షములే, “పలాశీ ద్రుద్రుమాగమాః” అని అ. పదస్థానముగాఁ గల వానరులలోపల, ముఖ్యుల = శ్రేష్ఠులయొక్క, రణంబుఁ గనుచు సమ్మోదమందెను.
భారత. ఆనృపాలశ్రేష్ఠుఁడు = ధర్మరాజు, ఉరు = అధికమైన, మాధవ = కృష్ణునియొక్క, ప్రేమచేతఁ గృతమైన, విజయ = అర్జునునియొక్క, ప్రకర్షము = అతిశయమును, అంగదను = వేడుకచేత, అరయుచు, “అంగదనాథు మ్రింగినవృకావలి ద న్వెస ముట్టుకొన్న” యని సోమయాజుల ప్రయోగము. శరభ, కేసరి, గజ, ఋషభ, శతములభంగిని, బలి = బలముగల, సమీరణసుత = భీమునియొక్క, ఉగ్ర మౌనట్టుగా, సంపాతి = పాఱుచున్న, దస్రసుత = నకులసహదేవులయొక్క, అచ్ఛ = స్వచ్ఛములైన, భల్లరాజ = బాణశ్రేష్ఠములయొక్క, వేగ = వేగమును, దర్శితను = చూచువాఁడౌటచేత, దర్పంబు చూడ్కుల కొసఁగు, శూరతావిభాసి = శౌర్యముచేత నొప్పెడి, ఉత్తమోజుఁ డనెడుపాంచాలుని, పర = శత్రువులయొక్క, అసు = ప్రాణవాయువులకు, ఫణి = సర్పమైన, శిఖండిని, సైన్యేశున్ = ధృష్టద్యుమ్నుని కనుగొంచు, ద్రుపదముఖ్యుల ద్రుపదుఁడు మొదలైనవారియొక్క, రణంబు గనుచు సమ్మోదమందెను.
| శా. | క్షత్రాచారవిహారి యై విజయరక్షానిష్ఠఁ బెంపొందుని | 125 |
భారత. క్షత్త్ర = సారథియొక్క, ఆచారముచేత = సారథ్యముచేత ననుట, విహారియై, విజయ = అర్జునునియొక్క, విష్ణున్ = కృష్ణుని, హరియూథ = అశ్వసమూహమును, చోదకతను = త్రోలెడువాఁ డౌటచేత, కడమ సులభము.
రామ. క్షత్త్రాచార = క్షత్రియాచారముచేత, విజయరక్షా = జయసంపాదనమందుఁ గల, నిష్ఠను = ఆసక్తిచేత, విష్ణున్ = రాముని, హరియూథ = వానరకులమును, చోదకతను = పనిగొనువాఁ డౌటచేత, కడమ సరి.