Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. లంక, ముక్తధృతివిలాసముగన్ = తల్లడిల్లఁగా ననుట, మిగులఁజేరికను = అత్యంతసమీపమున, నడచి, దృఢములైన మనోరథములుగల, హరికుంజర = వానరశ్రేష్ఠుఁడైన సుగ్రీవునియొక్క, ఉగ్రబలమును, కొలిపి = పెరరేచి, పోరు నడపెను.

భారత. చేరి, కలంకముక్త =నిష్కళంకమైన, ధృతిచేత, విలాసముగన్ = ఒయ్యారముగా, దృఢమయిన మనస్సుగల రథహరికుంజరములచే నుగ్రమైన, బలము = సేనను, కడమ సమము.

క.

అమ్మనుజేంద్రునిబలవర్గము మొదలినాఁడు భీష్మరక్షోర్జితద
ర్పమునఁ గవియుసుయోధను
తమ్ములఁ జతురంగసైన్యతతుల జయించెన్.

123

భారత. భీష్మునియొక్క రక్షచేత నూర్జితమైన దర్పముచేత, కవియు = ఎదిరించునట్టి, సుయోధనుతమ్ములన్ = దుశ్శాసనాదులను, చతురంగసైన్యతతులను జయించెను.

రామ. అమ్మనుజేంద్రుని = రామునియొక్క, బలవర్గము, భీష్మ = భయంకరులైన, రక్షస్సులచేత, ఆర్జిత = సంపాదింపఁబడిన, సుయోధ = సద్భటులచేత, నుతమ్ముల = స్తుతియింపఁబడిన, సైన్యతతులను జయించెను.

సీ.

ఆనృపాలశ్రేష్ఠుఁ డవ్వేళనురుమాధ
           వప్రేమకృతవిజయప్రకర్ష
మరయుచు నంగదశరభకేసరిగజ
           ర్షభశతబలిసమీరణసుతాజి
కేళీమహత్త్వ మీక్షించుచు నుగ్రసం
           పాతిదస్రసుతాచ్ఛభల్లరాజ
వేగదర్శితనూర్జితాగణ్యదర్పంబు
           చూడ్కుల కొసఁగుచు శూరతావి


తే.

భాసి నుత్తమోజుఁ బరాసుఫణిశిఖండి
ననలసంభవు సైన్యేశు ననిఁ గరంబు
మగతనము సూపఁ గనుఁగొంచు మఱియు ద్రుపద
ముఖ్యులరణంబు గనుచు సమ్మోద మందె.

124

రామ. ఆనృపాలశ్రేష్ఠుఁడు = రాముఁడు, అవ్వేళను = యుద్ధసమయమందు, రుమాధవ = సుగ్రీవునియొక్క, ప్రేమ = నెనరుచేత, కృతి = చేయఁబడిన, విజయ = గెలుపుయొక్క, ప్రకర్షము = అతిశయమును, ఆరయుచు, అంగద, శరభ, కేసరి, గజ, ఋషభ,