సంతతి = భీముఁడు, నీదు పెద్దతమ్ముని = దుశ్శాసనునియొక్క, నెత్తురు గ్రోలఁగాను, నిన్నుఁ గృతమైన, ఊరుభంగునిన్ = తొడలు విఱుగుట గలవానిఁగా, ఒనరింపఁగాను జూచెదు.
రామ. ఆత్మను, నాఁటి = గ్రుచ్చుకొని, తనకాంత = సీతయొక్క, పరాభవము = తిరస్కారముచేత నైన, అల్కను, పెంపఁగాన్ = తీర్చుకొనుటకొఱకు, పేర్చురాజమణి = రామునియొక్క, ఆశుగసంతతి = బాణపరంపర, ఉరు = అధికమయిన, భంగునిన్ = పరాజయము గలవానిఁగా, ఒనరింపఁగాను జూచెదు.
| చ. | అని నమితప్రతాపుఁ డగునాతనితమ్ముని మేఘనాదభం | 112 |
రామ. ఆతనితమ్ముని = లక్ష్మణునియొక్క, మేఘనాదభంజన = ఇంద్రజిత్తువధచేత, కృతి = కృతకృత్యులైన, దేవ = దేవతలచేత, దత్త = చేయఁబడిన, జయశబ్దములచేత వర్దిత మైన, సింహనాదము = అట్టహాసము, దుస్సహ = సహింపరాని, కర్ణనిపాత = శ్రవణప్రదేశముగల, సూచియై = సూదియై, వినఁబడును.
భారత. ఆతనితమ్ముని = భీమునితమ్ముఁడైన యర్జునునియొక్క, మేఘనాదముయొక్క భంజనమందు, కృతి = సమర్థమైన, దేవదత్తముయొక్క, జయశబ్ద = జయసమయశబ్దముచేత, వివర్ధితమైన సింహనాదము, దుస్సహమైన కర్ణునియొక్క, నిపాత = పాటును, సూచించునదియై వినఁబడును, అర్థాంతరము. ఆతని = భీమునియొక్క, తమ్ముని = తమ్ముఁ డైనయర్జునునియొక్క, మేఘనాద = మేఘగర్జనముయొక్క, భంజనమందు, కృతి = సమర్థమైన, దేవదత్తముయొక్క, జయశబ్ద = జయసమయశబ్దముచేత, వివర్ధిత = వృద్ధిఁ బొందింపఁబడిన, అర్జునుదేవదత్తధ్వనిచేత వృద్ధిఁ బొందింపఁబడిన దనుట, సింహనాదము = భీముని సింహనాదమని యన్వయము. దుస్సహ = దుస్సహుఁ డనెడు దుర్యోధనుని తమ్మునియొక్కయు, కర్ణ = కర్ణునియొక్కయు, నిపాతమును సూచించునదై, అర్జునుఁడు కర్ణుని సంహరించెడు సమయమందు భీముఁడు దుస్సహుని సంహరించి సింహనాదము చేయు ననుట.
| క. | వారలసంగర మిట్టిది, యీరీతిం దెలుప నేల యెఱుఁగంబడదే | 113 |
భారత. వారల = భీమార్జునులయొక్క, సంగరము = ప్రతిజ్ఞ, ఇట్టిది, అతిక్రూర మహా, కపటభవ = కపటజన్యమైన, దురోదరవేళను = ద్యూతసమయమందు, “పణే ద్యూతే దురోదరమ్" అని అ. ఎఱుఁగంబడదే = తెలియకుండెడినా.