Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని మఱియుఁ దఱిమి చెప్పఁగ
నను వైనటులెల్లఁ జెప్ప నది యాతనికం
టెను మఱి యెవ్వఁడు నేమని
నినుఁ దెలిపెడిఁ జెడియెఁ గులము నీకతనఁ దుదన్.

108

రెంటికి సమము.

క.

అని పలికి వెండియును నా
తనిపట్టినచలము రాజ్యదర్పవికారం
బును సైఁపక యుడికించుట
కనయము నుద్ధతమనస్కుఁ డగుచుం బలికెన్.

109

భారత. అని పలికి వెండియు, ఆతని = ధృతరాష్ట్రునియొక్క, పట్టిని = కొడుకైన దుర్యోధనునినే, ఉడికించుటకు నుద్దతమనస్కుఁ డగుచుఁ బలికెను.

రామ. అని పలికి, ఆతని = ఆరావణునియొక్క, పట్టిన చలమును సైఁపక పలికెను.

క.

సుబలాత్మజమాయాద్యూ
తబలంబున నమర సంపదలు గొని యెంతేఁ
బ్రబలి తది నేఁడు నిలువదు
ప్రబలాహవభీమనరవరభుజోద్ధతిచేన్.

110

రామ. సుబలాత్మజ = బలవంతుఁడైన యింద్రజిత్తుయొక్క, మాయాదుల చేత, ఊత = క్రువ్వఁబడిన వ్యాపింపఁబడినయట్టి యనుట. “ఊయీ తంతుసంతానే” అనుధాతువు బలంబునన్ = బలిమిచేత, అమర సంపదలు గొని, అది = ఆప్రాబల్యము, ప్రబలాహవమందు భీమమైన, నరవర = రామునియొక్క, భుజోద్ధతిచేత నేఁడు, నిలువదు - క్రియ.

భారత. సుబలాత్మజ = శకునియొక్క, మాయచేతిద్యూతబలంబునన్ = బలముచేత, అమర, అది = ఆద్యూతము, ప్రబలమైన, ఆహవ = యుద్ధముగల, భీమునియొక్కయు, వరభుజోద్ధతి చేత, నిలువదు - క్రియ.

చ.

ఘనముగ నాత్మ నాఁటితనకాంతపరాభవ మల్కఁ బెంపఁగా
ననయముఁ బేర్చు రాజమణి యాశుగసంతతి నీదుపెద్దత
మ్ముని నెదురొమ్మునెత్తురు సముద్ధతిఁ గ్రోల నినుం గృతోరుభం
గుని నొనరింపఁ జూచె దిదిగోఁ గలహంబ యభీష్టమేనియున్.

111

భారత. నాఁటి = ఆజూదమునాఁటియందైన, తనకాంత = ద్రౌపదియొక్క, పరాభవము, అల్కను, పెంపఁగాన్ = అధికము సేయఁగా, పేర్చు = ఉగ్రుఁడౌచున్న, ఆశుగ