భారత. ఒండుచోటువలె = ఎఱుఁగనిచోటువలెనె, నరుండు-భీముఁడు = అర్జునుఁడు, భీముఁడునని, ఎన్నెదు = ఎంచెదవు, కర్ణభీష్ములయొక్కయు, కోదండగురు = ద్రోణాచార్యులయొక్కయు, మత్ = నాయొక్క, బల = చతురంగబలములయొక్క, ఉద్దండతను, మదిఁ దార్పవు = ఎంచవు, కడమ సులభము.
| చ. | అనుటయు నమ్మదాంధునకు నాహరి యి ట్లను నాదుమాట నీ | 97 |
భారత. బల్లిదుని, ఆవిభు = ధర్మరాజును, చూచునంతకును నామాట యొప్పగునే యని సింహావలోకనము, కడమ సులభము.
రామ. ఆహరి = అంగదుఁడు, ఇట్లను, భీమ = భయంకరమైన, ధనంజయ = అగ్నిభంగిని, భాసురమైన, ఆవిభున్ = స్వస్వామిని.
| చ. | అమితచమూసమూర్జితుఁడ నంచు నహంకృతి మానవేమొ న | 98 |
రామ. మదవిభూతి = గర్వాతిశయమును, నీ వెఱుఁగ = నీ కెఱుకపడునట్టుగా, వాసరనాయకు లమరినవారు.
భారత. మదవిభూతిచేత నహంకృతిని మానవేమొ, నరనాయకు లావిభునొద్ద నమరినవారు = విరాటద్రుపదాదులును ధర్మరాజునకు సహాయమైనవా రనుట, నీ వెఱుఁగవా.
| వ. | అని మఱియు ననేకప్రకారంబులు నీతియు బలిమియు మహోద్ధతియు | 99 |
రెంటికిని సరి సులభము.
| తే. | అకట నెఱయ నీయాత్మనాశకునికర్ణ | 100 |
భారత. ఆశకుని కర్ణులయొక్క దౌష్ట్య మెట్టిదొ నామాట నీయాత్మను దగుల దనుచు, ఆదర్పదుష్టమానసుని = దుర్యోధనునియొక్క, గురుని = తండ్రిని ధృతరాష్ట్రుని, వారణోద్యుక్తిని = యుద్ధనివారణయత్నముచేత, పలికెను.