Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. జీవితరక్షణార్థివి, ఐరావణదంతి = ఐరావతము, “ఐరావతోభ్రమాతంగై రావణాభ్రమువల్లభాః” అని అ. వాహనముగాఁ గలవాని గెల్వవచ్చును, దుర్భావ = దుర్బుద్ధిచేత, విచేష్టమాన = వ్యాపరించెడువాఁడా, కురురాజకుమారక - సంబుద్ధి. భీమునియొక్క బాహులీలావిధికి, కడమ సరి.

వ.

అనుపల్కు లాకర్ణించి యాదురాగ్రహగ్రస్తుండు తత్సమయసముద్దీ
పితకోపాటోపంబు లోలోపలన యడంచికొనుచు శుష్కహసితంబు
ముఖంబునకుం దెచ్చుకొని.

92

ఉభయసమము సులభము.

క.

కొలఁది గన కెట్టివారుం
బెలుచన దవుదవ్వులందు బెదరించియ మూ
లల వేయించికొనంగాఁ
దలఁచెద రిది కాలగుణమొ దైవఘటనయో.

93

రెంటికిని సమము సులభము.

వ.

అని యాదూతకృత్యధౌరేయు నుపలక్షించి.

94


చ.

బలుములు సూపి యిట్టు నటుఁ బల్కితి వెఱ్ఱిహరీ పరోక్తముల్
వలుకనె కానిబుద్ధి మఱి పాఱదు ని న్నతఁ డుర్విపాలుగా
వలసి యి టాడఁ బంపె విడువన్ మహిజన్మముఁ బౌరుషంబు ని
ర్మలధృతియుం బొగడ్తగన మాఱ్కొనరమ్మను చూచెదన్నియున్.

95

భారత. హరీ = కృష్ణా, ఉర్వి = భూమియొక్క, పాలు గావలసి = రాజ్యభాగము గావలసి యనుట, మహిన్ = భూమిని, విడువను = ఇవ్వను.

రామ. వెఱ్ఱిహరీ = వెఱ్ఱికోతీ, ని న్నతఁడు, ఉర్విపాలు గావలసి = నేల పాలగుటకు, ఆడఁబంపెను, మహిజన్ = సీతను, మమున్ = మమును, మాఱ్కొనరమ్మనుము.

ఉ.

కొండొకయొండుచోటువలెఁ గొంకక బింకముతో నరుండు భీ
ముం డని నీవు మాటికి సమున్నతి నెన్నెదు కర్ణభీష్మకో
దండగురుప్రతాపవితతప్రథనప్రథ నొప్పుమద్బలో
ద్దండత యించుకైన మదిఁ దార్ప విదేమిటినేర్పు సెప్పుమా.

96

రామ. కొండొకయొండుచోటువలె, నరుండు = మనుష్యుఁడు, భీముండు = భయంకరుఁడని, ఎన్నెదు, రాక్షసులు నరభోజనులు గారా యనుట, కర్ణభీష్మ = శ్రవణకఠోరమైన, కోదండ = వింటియొక్క, గురుప్ తాపముచేత, వితత = విస్తారమైన, ప్రథనప్రథను = యుద్ధప్రసిద్ధిచేత, ఒప్పుచున్న.