Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

సాధుకృతప్రవేశుఁ డయి సాహసవత్తరచిత్తశత్రుదు
ర్యోధను నింద్రజిద్గురుమహోజ్జ్వలవైభవగర్వితు న్బలో
త్సేధసముద్ధతుం డగువిధిం గృతదర్శనుఁ డైనవాని మా
నాధికుఁ జూచి యి ట్టను మహాసభలో జను లందఱు న్వినన్.

85

భారత. సాధు = సత్పురుషులచేత, కృతప్రవేశుఁడయి, సాహసవత్తర = మిక్కిలి నుద్ధతములైన, చిత్తశత్రువులు గలవాని, ఇంద్రజిత్ = ఇంద్రుని గెల్చిన, గురు = అధికమైన, మహ = ఉత్సవములచే నైన, ఉజ్జ్వలవైభవముచేత, గర్వితుని = గర్వించినవాని, బలోత్సేధ = బలౌన్నత్యముచేత, “ఉత్సేధశ్చోచ్ఛ్రయశ్చ సః” అని అ. సముద్ధతుని దుర్యోధనుని జూచి యి ట్లనును.

రామ. సాధు = లెస్సయౌనట్టుగా, కృతప్రవేశుఁడయి, సాహసవత్తర = మిక్కిలి సాహసవంతమైన, చిత్తముగల శత్రువులకు, దుర్యోధను = పోర శక్యము గానివాని, ఇంద్రజిద్గురుని= రావణుని, ఇట్లను, కడమ సులభము.

తే.

క్షాంతిజయశోభిరాముఁ డనంతబలుఁడు
ధర్మసూతి యిప్పుడును నీదౌష్ట్య మాత్మ
నెన్నక నయోక్తి నినుఁ దేర్ప నన్నుఁ బనిచె
వినుము నామాట దుర్మదావేశ ముడిగి.

86

రామ. క్షాంతిజయములచేత, శోభి = ఒప్పెడువాఁడు, రాముఁడు, ధర్మసూతి = ధర్మమునకుఁ గారణమైనవాఁడు.

భారత. క్షాంతిజ = శాంతివలనఁ బుట్టిన, యశః = కీర్తిచేత, అభిరాముఁడు, ధర్మసూతి = ధర్మజుఁడు, కడమ సమము.

చ.

నియతముగాఁగ నీ విపుడు నిన్నును నీవిభవంబు నీమహా
న్వయమును గాచికోవలసినన్ మగుడం విను మట్ల విక్రమ
క్రియమయి మాయచే నపహరించిన భూమిజనాదరార్హని
శ్చయుఁ డగునన్నరేశ్వరునిశాసన మిట్టిద నీకుఁ జెప్పితిన్.

87

భారత. మాయచే నపహరించిన భూమిని మగుడ విడుము.

రామ. భూమిజను = సీతను, మగుడన్విడుము.

క.

భీమార్జునబాహుబలో
ద్ధామత నీ వెఱిఁగినదియ తజ్జయశాలిన్
దా మిక్కిలి శౌర్యోన్నతి
చే మించినమేటి యతనిఁ జెనకి బ్రతికెదే.

88