Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. తనదు, హితకార్యపథవర్తను లయినవారును, సు = లెస్సైన, భద్ర = శుభమును, ఆనందమునుగలనవమై, రణోత్సవము = యుద్ధక్రీడ, నడపఁదగునని పలుకఁగా దృఢోత్సాహుఁ డయ్యెనని ముందరిపద్యమునఁ గ్రియ.

భారత. తనదుహితకు, ఆర్యపథవర్తను లగువారును = ఆపాండవులును, కని = తెలిసి, సుభద్రానందన = అభిమన్యునియొక్క, వరణోత్సవము = వివాహము, నడపఁ దగునని, పలుక = చెప్పినందువల్ల, కుళకము గనుకఁ దనకు ననుమతి దలిర్పంగానని క్రిందటిపద్యమునకు నన్వయము.

తే.

తద్విధానంబునకు దృఢోత్సాహుఁ డయ్యెఁ
దనయకల్యాణవిధిప్రయత్నమునఁ జేసి
రయముతో వారు నాత్మీయమయిన మిత్ర
బంధుపరివారతతిఁ గూర్చి ప్రౌఢి మెఱయ.

77

భారత. తద్విధానంబునకున్ = వివాహక్రియకు, దృఢోత్సాహుఁ డయ్యెను, తత్పురీనాయకుఁడని క్రిందటిపద్యమునఁ గర్తృపదము, వారును = పాండవులును, మిత్రబంధుపరివారములయొక్క, తతి = సమూహమును, కూర్చి = పిలిపించి, తనయ = కుమారుఁడైన యభిమన్యునియొక్క, కల్యాణవిధిని, అయముతో = శుభముతో, చేసిరి.

రామ. తద్విధానంబునకున్, ఆయుద్ధక్రియకు, తనయొక్క, అకల్యాణవిధి = దురదృష్టముయొక్క, ప్రయత్నమునఁ జేసి దృఢోత్సాహుఁ డయ్యెను, కడమ సులభము.

వ.

అంతఁ బ్రతిపక్షవిజయంబునకు నుచితసమయం బగుట భావించి.

78

రెంటికి సరి.

క.

అతులితతేజుఁడు వైవ, స్వతసంతతి రాజవరుఁడు చతురనయసమా
హృతఘనతరహరికుంజర, శతాంగవిస్ఫూర్తిశోభిసైన్యముతోడన్.

79

రామ. వైవస్వతసంతతి = మనువంశమందుఁగల, రాజవరుఁడు = రాముఁడు, సమాహృత = కూర్పఁబడిన, ఘనతర = అత్యధికులైన, హరికుంజర = వానరశ్రేష్ఠులయొక్క, అంగవిస్ఫూర్తిచేత, శోభి = ఒప్పుచున్న, సైన్యముతోడ, విడియించెనని ముందరిపద్యమునఁ గ్రియ.

భారత. వైవస్వతసంతతి = ధర్మజుఁడు, హరి = గుఱ్ఱములయొక్కయు, కుంజర = గజములయొక్కయు, శతాంగ = రథములయొక్కయు, “శతాంగస్స్యందనో రథః” అని అ. విస్ఫూర్తిచేత, కడమ సమము.

క.

నడచి యుపప్లావ్యపురం, బు డగ్గఱి వనప్రదేశముల బలచయముల్
విడియించి తనప్రతాపము,కడు నఖిలదిగంచలములఁ గ్రమ్ముకొనంగన్.

80

భారత. నడచి = కదలి, ఉపప్లావ్యపురంబు డగ్గఱి.