Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశింపని, ఆత్మసత్ప్రభావతను = తమయొక్క సత్ప్రభావము గలవా రౌటచేత, పరఁగుచు, పాండురాజసుతులు = ధర్మరాజాదులు, తద్విభుండు = ఆపట్టణమునకు రాజైన విరటుఁడు, తీర్ణ = తరింపఁబడిన, అతికృఛ = మహాపదలనెడి, అర్జవము గలవాఁడుగా, వినివారిత = మిక్కిలి నివారింపఁబడిన, రిపు = శత్రువులయొక్క, దర్పభారులైన = గర్వాతిశయము గలవారలైనను, భావము - ఇట్లు విరాటునిపట్టణము మనః ప్రియముగాఁ గైకొని నిష్కళంకమైన ధైర్యముతోడ నందుఁ బ్రకాశింపని ప్రభావము గలవారై యడంగియుండి పాండురాజసుతు లావిరటుఁడు మహాపదలను దరించునట్టు శత్రుదర్భమును హరించిరనుట, అట్లు హరింపఁగా, వారిని = ఆపాండవులను, నిజాస్థానమంటపమునన్ = తనకొల్వుకూటమునందు, ప్రగల్భవాక్కులచేత, ప్రకటిత = ప్రకాశింపఁ జేయఁబడిన, ఆత్మ = తమయొక్క, స్వభావవర్తనలు గలవారై, గారవించెను.

వ.

ఇట్లు వివిధసంభావనాసంతోషితస్వాంతులం గావించి వారికిఁ దనకు
నక్కాలంబున.

74

రెంటికి సరి సులభము.

క.

సమరాగమనస్ఫూర్తికి
నమరువచోగతుల నరవరాత్మజునిప్రసం
గమయి తనకన్యనయయు
క్తిమహితనయ నొసఁగ ననుమతి దలిర్పంగాన్.

75

భారత. సమరాగ = సమానురాగముగల, మనస్స్ఫూర్తికి, నర = అర్జునునియొక్క, వరాత్మజుని = అభిమన్యునియొక్క, ప్రసంగమయి = ప్రసంగము రాఁగా, తనకన్యను = ఉత్తరను, అయయుక్తి = భాగ్యసంగతిచేత, “అయశ్శుభావహో విధిః" అని అ. మహితమైన, నయ = నీతిగలదాని, ఒసఁగ = ఈఁగ, అనుమతి దలిర్పఁగా, ముందటిపద్యములఁ గుళకము.

రామ. సమర = యుద్ధముయొక్క, ఆగమనస్ఫూర్తికి, నరవరాత్మజుని = రామునియొక్క, ప్రసంగమయి, అన్య = శత్రువైన, నయ = నీతిగల, నీతివిరుద్ధమయిన దనుట, యుక్తిచేత, మహితనయను = సీతను, ఒసఁగను = తిరుగ విడువను, అను = అనెడి, మతి = బుద్ధి, తనకుఁ దలిర్పఁగా నని యన్వయము. కడమ సరి.

క.

తనదుహిత కార్యపథవ
ర్తను లగువారుఁ దనకోర్కితమి గని యింపుల్
దనరార సుభద్రానం
దనవరణోత్సవము నడపఁ దగు నని పలుకన్.

76