భారత. వారిత = వారింపఁబడిన, రణ = యుద్ధమందుఁగల, లీల = విలాసము, పెంపు మీఱఁగా, మున్నెట్లట్ల = మునుపటివలె, నిజావ్యాహతేచ్ఛచేత, యంతయై = సారథియై, హరి = గుఱ్ఱాలయొక్క, వితతిని నడపుచు, దక్షిణాభిముఖగమన మాచరించెను = ఉత్తరమునుండి దక్షిణమునకుఁ దిరిగెననుట.
రామ. తత్ = ఆసముద్రునియొక్క, అభిమతపద్ధతిని = సేతువు గట్టి యనుట, వారి = ఉదకములయొక్క, తరణ = దాఁటుటయందుఁగల, లీల, హరివితతిని = వానరసమూహమును, నియంతయై = నియామకుఁడై, నడపుచు, దక్షిణాభిముఖగమన మాచరించెను = లంకమీఁదికిఁ గదలెను.
| సీ. | సముచితసరణి ని ట్లమరవై రాటన | |
| తే. | వారినాప్తులఁ గడు నంత గారవించెఁ | 73 |
రామ. అమరవైర = దేవతలయందు వైరముగల రాక్షసులయొక్క, అటనగరిమను = సంచారాధిక్యమును, అశ్లాఘ్యంబుగాఁ గొని = లెక్క సేయక, లంక, నిరుక్తధీరతనందన్ = తల్లడిల్లఁగా, అభిద్యోతిత = ప్రకాశింపుచున్న, పాండు = తెల్లనైన, రాజు = చంద్రుఁడు, సుతుల = లెస్సపోలికగాఁ గల, ఆతతకీర్తివిభవము గలవాఁడు, తద్విభుండు = రాముఁడు, తీర్ణ = దాఁటఁబడిన, అతికృఛ్ర = మిక్కిలి ఘోరమైన, మహార్ణవము గలవాఁడు, గాను, విని = రాముఁడు సముద్రము దాఁటెనని విని యనుట, తత్పురీ = ఆలంకయొక్క, నాయకుఁడు = రావణుఁడు, అలఘుప్రగల్భవాక్కులచేతఁ బ్రకటితములైన స్వభావవర్తనలు గలవారై పేర్చునట్టి ప్రథితబలులను, ఆప్తులనుగా.
భారత. సముచితసరణిని, వైరాటనగరి = విరాటునిసంబంధమైన పత్తనమును, మనసునకు శ్లాఘ్యంబుగా, కలంక = ఎవ్వరు తెలిసినారో యనెడుభయముచేత, నిర్ముక్త = విడువఁబడిన, ధీరతను = ధైర్యముచేత, అందున్ = ఆపట్టణమందు, అనభిద్యోతిత =