Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. పురుషమూర్తితోడఁ బ్రోవైన = పురుషాకృతియైన, దైన్యంబుపోలె = అతిఖిన్నుఁడై యనుట, భూవరుండు = దుర్యోధనుఁడు, అనీక = యుద్ధముచే, సాధ్యమొకటి లేకున్కిని, గుండె బెదరఁ బాఱెను.

రామ. పురుషమూర్తితోడ = పురుషాకారముతో, కానుపించి, సముద్రుఁ డనెడుమాట, భూవరుండ = సంబుద్ధి, నీకు నసాధ్య మొకటి లేకున్కిని, గుండె = తనగుండియ, బెదరఁ బాఱెను.

వ.

దానం జేసి.

70


సీ.

ఇదె నీకు శరణు సొచ్చెద శాంతుఁడవు గమ్ము
           వెదక నీ కెవ్వరు నెదురులేర
పార్థదర్పమున నీపస గాన కి ట్టెది
           ర్చినవారిదోషంబు గనియె ఫలము
నిఁకఁ గావు మర్థింతు నేనోయఖండద
           యా సముద్రుండ నాయందుఁ గరుణ
నడవఁ గట్టి పగఱ నడఁగించితే నేమి
           చెప్ప నమోఘవాంఛితుఁడ నగుదు


ఆ.

హరివిగాక నీవు నరమాత్రుఁడవె యని
యంత వినయభక్తు లతిశయిల్ల
బాదపద్మములకుఁ బ్రణుతి గావించిన
నమ్మహాత్ముఁ డతని నాదరించె.

71

రామ. ఎదురులేరు, అపార్థమయిన దర్పముచేత, వారిదోషంబు = ఉదకదోషము, అఖండదయా-సంబుద్ధి. నేను సముద్రుండను నాయందు, కరుణనడవన్ = దయ ప్రవర్తిలఁగా, గట్టిపగఱను = క్రూరశత్రువులను, అడఁగించితి యే నేమి చెప్ప, అమోఘవాంఛితుఁడ నగుదును = సిద్ధసంకల్పుండ నగుదును. ఇంక నాకోరికలెల్ల సిద్ధించుననుట, అంతైన.

భారత. అఖండదయాసముద్రుండ - పార్థ - సంబుద్ధులు. అని, యంత = సారథి - ఉత్తరుఁడు, ప్రణుతి గావించిన, అమ్మహాత్ముఁడు = అర్జునుఁడు, ఆదరించెను, కడమ సరి సులభము.

తే.

తదభిమతపద్ధతిని వారితరణలీల
పెంపు మీఱంగ దక్షిణాభిముఖగమన
మాచరించె మున్నెట్లట్ల హరివితతిని
యంతయై నడపుచు నిజావ్యాహతేచ్ఛ.

72