| తే. | మృదుతఁ బని గామి గని రోసి పొడివె నంప | 64 |
రామ. గోత్రను, “గోత్రా కుః పృథివీ పృథ్వీ" అని అ. అరికట్టుకొని = అబలించుకొని, విడువని, వాహినులఱేనిక్ = సముద్రుని, పొదివెను.
భారత. ఆదిత్యకులరాజ = ఇంద్రునియొక్క, వరసుతుండు = అర్జునుఁడు, గోత్రను = గోసమూహమును, "ఇనిత్రకట్యచశ్చఖలగోరథేభ్యః, క్రమాదేతే స్యుస్సమూహార్థే, గవాం సమూహో గోత్రా” అని ప్రక్రియ. ఱేని = దుర్యోధనునియొక్క, గుండియ కలంగ, వాహినుల = సేనలను, అంపవానచేతఁ బొదివెను.
| వ. | అప్పుడు. | 65 |
| క. | అవి దితవిఘ్ననరవరా | 66 |
భారత. అవి = ఆసేనలు, దితవిఘ్న = ఖండింపఁబడిన విఘ్నముగల - వారింపరాని వనుట, నర = అర్జునునియొక్క, వరాస్త్రములచేత, విభగ్న = తునిగిన, అంగములయిన రథతురగాదులు కలవౌచును, రహిత = విడువఁబడిన, మహత్ = అధికమైన, గోనివహము గలవౌటచేత, తత్ = ఆయర్జునునియొక్క, ఉగ్రములయిన, కాండ = బాణములను, దృఢమైన సత్త్వమును, ద్వంద్వమందు బహువచనము, వెలయఁగా, ఆకులమైన గతిని జెందెను.
రామ. అవిదిత = ఎఱుఁగఁబడని, విఘ్నముగల, నరవర = రామునియొక్క, అస్త్రములచేత, విభగ్నాంగము లగుచు, తత్ = ఆసముద్రునియొక్క, ఉగ్ర = భయంకరమైన, కాండ = ఉదకమందున్న, "కాండో స్త్రీ దండబాణార్వవర్గావసరవారిషు” అని అ. దృఢములయిన, సత్త్వంబులు = జంతువులు, రహిత = విడువఁబడిన, మహత్ = ఘనమైన, ఆగోనివహతను = పాపసంఘము గలవౌటచేత, నాకుల = దేవకలయొక్క, గతిఁ జెందెను - దేవలోకమునకుఁ బోయె ననుట.
| వ. | తదనంతరంబ. | 67 |
| సీ. | మఱియు నుద్ధతచేష్టమానకురుబలాబ్ధి | |