Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

తొలుతటనుండియు న్వలదు దుర్జయవైరము మాను మంచు ని
చ్చలుఁ జెవి నిల్లు గట్టుకొని చాటితి నన్ను గణింపవైతి పె
న్బలియునితోడిపో రిది యుపస్థిత మయ్యె నగర్వబుద్ధి నా
పలు కిఁక నైనఁ గైకొను మపాయ మగున్ దురహంక్రియోద్ధతిన్.

54

ఉభయసమము.

వ.

అనుటయు నతనిం గటాక్షించి.

55


తే.

ఇనతనూభవుఁ డధిపున కిచ్చకముగఁ
బలికె నెపుడును రిపుపక్షపాతభాష
లుడుగవైతి నిన్నేమనియెడిది నిన్ను
నాప్తుఁ డనియున్నదొర వెఱ్ఱియనుట గాక.

56

భారత. ఇనతనూభవుఁడు = కర్ణుఁడు.

రామ. ఇనతనూభవుఁడు = ప్రభుపుత్త్రుఁ డింద్రజిత్తు, కడమ రెంటికి సరి.

క.

ఒకనరునివిక్రమము మా, టికిఁ బొగడెద వింత కడుఁ గడిందిగమనయే
లికకుఁ గలయోధవీర, ప్రకరము నీ కేలదృష్టి పట్టదు చెపుమా.

57

రామ. ఒక, నరుని = మనుష్యునియొక్క.

భారత. ఒకనరుని = ఒకయర్జునునియొక్క, కడమ సరి.

ఆ.

ఇట్టిమాటలాడునట్టి మాన్యులనిండ్ల
కడనయుండి మనకుఁ గార్యసిద్ధి
గలుగఁగోరుఁ డనుట గా కిటువంటిక
ర్జములకుఁ బిలిపింపఁజనునె దొరకు.

58

రెండింటికి సరి.

వ.

అనవుడు నతం డతని నధిక్షేపించి యధిపతి కి ట్లనియె.

59

భారత. అతండు = భీష్ముఁడు.

రామ. అతండు = విభీషణుఁడు.

ఆ.

ఇట్టిపడుచుమాట లెడదఁ గైకొనక నీ
వాత్మరక్షకొఱకు నాశ్రయింపు
గురుకృపాదు లైన గుణములప్రోకల
రాజనందనుల మహాజిచణుల.

60

రామ. గురుకృపాదులైన = అధికమైన దయ మొదలుగాఁగల, గుణములయొక్క, ప్రోకలన్ = రాసులయినవారిని, రాజనందనులన్ = రామలక్ష్మణులను, ఆశ్రయింపుము.