Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పోఁగలాఁ డిదిగోఁ దనపోతరమునఁ
గ్రమ్మఱం గాన కితఁడు సభ్రాతృకముగ.

52

భారత. అసమయమందయిన యాత్మోద్ధతి యనెడిపిశాచి, అన్నుగొల్ప = ఒడలెఱుఁగ రాకుండఁ జేయఁగా, కానకు = అడవికి, సభ్రాతృకముగఁ బోఁగలాఁడు.

రామ. అసమ = సరి లేని, ఆత్మోద్ధతిపిశాచి, పొడవడంగి = అడంగి యనుట, సభ్రాతృకముగ = తమ్మునితోఁగూడ, క్రమ్మఱంగానక = తిరిగిపోలేక, పోఁగలాఁడు.

సీ.

అన నప్పు డెన్నిక నమరశత్రువిభీష
            ణుఁడు భీష్ముఁ డనుశంక నులిమివైచి
పలుకుఁ బంతము మీఱఁ గలనికినాయిత
            పడువార మెల్లను బడుట గాని
మన కింక సమయమ నాట లే దిది యెంచ
            వలదు నీ వజ్ఞాతవాస ముచిత
మగునీతి ముగియించి యాజికి నఱ మెద
            వాభీలరణతేజుఁ డాతఁ డతని


ఆ.

మాఱ్కొనుట భరంబు మహితనయాత్యాగ
మునఁ జలింపక మన మనికి నిలువ
యత్న మాచరింపు మన్యులబుద్ధిచే
సరకుగొనక యునికి జాడగాదు.

53

రామ. అన నప్పుడు, అమరశత్రుని = రావణుని, విభీషణుఁడు, భీష్ముఁ డనుశంక = భయంకరుఁ డనెడివిచారమును, నులిమివైచి = మాని, పలుకును, మనకు, సమయము = చావము, అనుమాట లేదు, ఎంచవలదు = నిశ్చయము, నీవు, అజ్ఞాతవా = ఎఱుఁగనివాఁడవా, “జ్ఞాతా తువిదురో విందుః" అని అ. సముచితమగు = ఉచితమైన, ఆజికి, అఱమెదవు = యత్నముఁ జేసెదవు, మహితనయాత్యాగమునన్ = సీతను విడుచుటయందు, చలింపక = సీతను నిచ్చి యనుట, మన = మనయొక్క, మనికి = బ్రతుకు, జాడగాద.

భారత. అననప్పుడు, ఎన్నికనమరన్ = లెక్క పెట్టినవాఁడై, శత్రువిభీషణుఁడు భీష్ముఁడు, అను = పల్కును, సమయమన్మాట = అజ్ఞాతవాసమర్యాద యనెడుపలుకు, లేదు, అజ్ఞాతవాసమును, ఉచితమగు, నీతిని = నీతిచేత, నఱమెన్ = నడచెను, దవ = దావానలముభంగిని, ఆభీల = భయంకరమైన, రణతేజుఁడు = యుద్ధప్రతాపము గలవాఁడు, మహితమైన, నయ = నీతియొక్క, ఆత్యాగమునన్ = విడువకుండుటయందు, చలింపక, స్థితమైనవాఁడై, మనము, అనికి నిలువ = యుద్ధమునకు నిలుచునట్లు, ఆచరింపుము.