వికారముగలవాని = పేడివాని ననుట, ఆనాకీశసంతతిని = అర్జునుని, క్షత్తృ = సారథియొక్క, ఆచారమునను, కొని = చేకొని, ఉత్తరుఁడు జయయాత్రఁ గదలెను, అంతట, ఆనృపాలకుమారకుని = ఉత్తరుని, రిపుల = దుర్యోధనాదులయొక్క, బలశ్రేణి మెఱయఁగా, సాధ్వసము, సంశ్రయించెను = పొందెను.
రామ. అంతనరయన్ = లెస్సగా విచారింపఁగా, తత్ = ఆయాత్రకు, శుభలగ్నము దొరకెను, అతి, జిష్ణుఁడు = జయశీలుఁడు, ఆయుత్తరుఁడు = శ్రేష్ఠుఁడయిన రాముఁడు, యాత్రఁ గదలెను, మహనీయమైన, శుద్ధాంత = సీతయొక్క యనుట, ఇందుకుఁ బ్రయోగము. “కుందస్మితం కుటిలకుంతల మిందుచూడం ఛందశ్శిఖాభరణచారుపదారవిందం, కందర్పదర్పకలికాంకురకాలమేఘ మంతఃపురం పురరిపోరవలోకయామః" అని శ్రీ శంకరాచార్యులశ్లోకము. మంజుల మైనయాస్యప్రవర్తనచేత, గురు = వ్రేఁగైన, భావ = అభిప్రాయమునకు, అర్హ = తగిన, తనువికారము గలవాని, సీతావిరహమునఁ గృశత్వపాండుత్వములు గలవాని ననుట, క్షత్రాచారమునకు = యుద్ధమునకు, నానా = బహువిధమైన, కీశసంతతిఁ గొని = వానరసమూహమును జేర్చుకొని, “మర్కటో వానరః కీశః” అని అ. యాత్ర సలుపువాని, ఆనృపాలకుమారకుని రాముని, రణమునకు, సాధు = సమర్థమైన, అసమశక్తికతమున, ఒకవింతతేజము, అమరరిపు = రాక్షసులయొక్క, లయ = సంహారమందు, ఔద్ధత్యవంతమైన, బలశ్రేణి = సేనాసమూహము, మెఱయఁగా, తేజము సంశ్రయించెను.
| సీ. | అతనిసముద్వేగ తతచేష్టమాననా | |
| తే. | పూన్కితో వీరరసలక్ష్మి వొదల నడచె | 45 |
రామ. అతని, సముద్వేగ = సంతోషవేగముతో ఁ గూడునట్టుగా, తత, చేష్టమాన = చేష్టింపుచున్న, నానా, కీశసంతతి = వానరసమూహము, ఆరాచకొమరుని, నియంతఁ