భారత. అకట, భవద్గురు = నీతండ్రియు, సేనాదికము, సేన మొదలైన చతురంగబలములును, పురస్థితింబరఁగమిని = పట్టణములో లేకయుండుటచేత, అతఁడు = దుర్యోధనుఁడు, ఇమ్మెయిఁ జెనకి = ఈలాగు చెనకియు, తలఁకఁడు.
రామ. అకట, భవత్ = నీయొక్క, గురు = ఘనమైన, సేనాదికము, పురస్స్థితిం బరఁగమిని = ముందరఁ గనిపింపకుండుటచేత, ఇమ్మెయిఁ జెనకి = ఈలాగు ద్రోహముచేసియు.
| ఆ. | అని యతండు దీపితౌద్ధత్యభాషలు | 43 |
రామ. అని, అతఁడు = హనుమంతుఁడు, పలుక, తనబలంబుకొలఁది, కానకు = అడవికి, అధికమై తనర్ప, రాచపట్టి = రాముఁడు, ఆహవోత్సాహంబును బూనెను.
భారత. అతఁడు = గొల్లవాఁడు, పలుక, బలంబుకొలఁది గానక = బలాబలచింత లేక, రాచపట్టి = ఉత్తరుఁడు, పూనెను.
| సీ. | ఈరీతిఁ బగఱపై నేగ ససంభ్రమ | |
| తే. | నానృపాలకుమారకు నంతట రణ | 44 |
భారత. యంతను “యంతా సూతః క్షత్తా చ సారథిః” అని అ. అరయఁగా, తత్ = ఆయుత్తరునియొక్క, శుభ = శ్రేయస్సునందు, లగ్నమైనమతి గలవాఁడు, జిష్ణుఁడు దొరకెను, మహనీయమైన, శుద్ధాంత = అంతఃపురమందు, మంజు = మనోహరమైన, లాస్యప్రవర్తన = నృత్తగీతాదిప్రచారములకు, గురుభావ = గురు వౌటకు, అర్హమైనతను