యొక్క, అభిధాన = చెప్పెడునందుఁగల, కథలు = మాటలును, ఒకింతతడవు = ఆయనకు సమ్మత మయ్యెడుపర్యంతము, నడపెను.
| వ. | పదంపడి యిట్లనియె. | 39 |
రామ. మఱియు హనుమంతుఁ డనెడుమాట.
భారత. కీలారమువాఁడు మఱియు నుత్తరునితో ననెడుమాట.
| ఆ. | అలఘుమాననీయబల విడిపింపుమా | 40 |
భారత. అలఘుమాననీయబల-సంబుద్ధి. తదపహారిని = ఆయావుల నపహరించినవాని, సుయోధనుని = దుర్యోధనుని, వధించి యాయావులను విడిపింపుమా యని యన్వయము.
రామ. అలఘుమాన-సంబుద్ధి, మాయావులబలుమేటి = మాయావంతులలో శ్రేష్ఠుఁ డయినవాని, సుయోధ = మంచియోధులను, నుత్ = ఓడించెడునట్టి, మదముచేత విమూఢుఁడయినవాని, తదపహారిని = సీతాపహారియైన రావణుని, వధించి నీయబలను విడిపింపుము.
| ఆ. | విను మొకింతదడసినను గార్య మిఁకఁ దప్పుఁ | 41 |
రామ. వేగన్ = ఉదయాననే, కదలి, గర్వయుక్తులయినదనుజులకు, కర్ణభీష్మ = శ్రవణకఠోరమైన, ఇష్వాస = వింటియొక్క, గురురణ = అధికగుణధ్వనియొక్క, “రణో స్త్రీయుధినాధ్వనౌ” అని నానార్థరత్నమాల. అతిమహిమచేత, వాని, రావణుని, గెలుము.
భారత. వేగఁ గదలి = శీఘ్రముగాఁ బోయి, గర్వయుక్ = గర్వముతోఁ గూడిన, తదనుజ = దుశ్శాసనునియొక్కయు, కర్ణ, భీష్మ, ఇష్వానగురు = ద్రోణునియొక్కయు, రణాతిమహిమను మించి, వాని = దుర్యోధనుని, గెలుము.
| క. | అకట భవద్గురుసేనా | 42 |