Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

వ్యధ లెల్లఁ దీఱ దేవరమహామహిమ వి
            లోకింపఁ గంటి నస్తోకగుణతఁ
బరఁగుభూమిజనాధిపతనయాయకలంక
            నున్న దిశాంతద్విషన్నికాయ
వెసమనమొదవులాలసమానకురుబల
            యత్నావరుద్ధంబు లగుచుఁ జనని
తాంతాకులీభవత్ప్రాణవాయువులతో
            వనరెడు నేను నివ్వార్తఁ జెప్పఁ


ఆ.

బాఱుతెంచితి నని ప్రత్యభిజ్ఞానస
మర్పణమున నతనిమదియొడఁబడఁ
దా నెఱిఁగినకొలఁది నానారివృత్తాభి
ధానకథ లొకింతతడవు నడపె.

38

భారత. దేవరమహామహిమను విలోకింపఁగంటిని, భూమిజనాధిపతనయా-సంబుద్ధి. ఆకలంక మౌనట్లుగా, నున్న = పోమొత్తఁబడిన, దిశాంత = దిగంతములయందుఁ గల, ద్విషన్నికాయ = శత్రుసమూహము గలవాఁడా, ఇది స్తోత్రరూపముగా యుద్ధమునకుఁ బురిగొల్పుట, మనమొదవులు = ఆవులు, అలసమాన = మిక్కిలియుఁ బ్రకాశింపుచున్న, కురుబలయత్నములచేత నవరుద్ధంబు లగుచు, చనన్ = పోఁగా, నితాంత = మిక్కిలిని, ఆకులీభవత్ = తొట్రుపడుచున్న, ప్రాణవాయువులతో, వనరెడు = వనరుచున్న, నేను, ప్రత్యభిజ్ఞాన = గుఱుతులయొక్క, సమర్పణమునన్ = తెలుపుటచేత ననుట, నానావిధములైన, అరి = శత్రువులయొక్క, వృత్త = వర్తనలయొక్కయు, అభిధాన = పేళ్లయొక్కయు, కథలు నడపెను, తానెఱిఁగిన కొలఁదిని గురుబలముగా గుఱుతులు సెప్పెననుట.

రామ. దేవరయొక్క మహిమచేత, భూమిజను = సీతను, విలోకింపఁగంటిని = చూచితిని, "దృష్టా సీతేతి తత్వతః" అన్నాడు గనుకఁ గంటి ననెడిపదము ముందుగాఁ జెప్పినాఁడు, అధి = మనోవ్యధయందు, పతన = పాటు గలది, తన్మగ్న యనుట, ఆయక = ఆయమసిత, లంకను = లంకయందు, శాంతద్విషన్ని కాయ = అణఁపఁబడిన శత్రుపుంజము గలవాఁడా——సంబుద్ధి. మనము, వెసను = వేగిరముగ, ఒదవులాలసను = ఒదవెడికొఱకే, మానక, ఊరు, బల = బలవంతమైన, యత్నముచేత నవరుద్ధంబు లగుచుఁ జనని, తాంత = బడలినవై, ఆకులీభవత్ = వ్యాకులములౌచున్న, ప్రాణవాయువులతోడఁగూడ, వనరెడును = విలపించుచున్నది, మనము వత్తుముని బలవంతమునఁ బ్రాణమును బెట్టుకొని యున్నదనుట, ఏను = నేను, ప్రత్యభిజ్ఞాన = గుఱుతుయొక్క - ఆయనశిరోరత్నము