Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఘటనచేత, దొర = విరటునియొక్క, కలంకపెంపెల్ల = విచారాతిశయమునంతయఁను, డీల్పఱిచెన్ = శమింపఁజేసెను, వైభవోదయమునకు, మహత్ = అధికమైన, ఆవాల = పాదయిన - స్థాన మైనదనుట. “స్యాదాలవాలమావాల” మ్మని అ. హస్తమందున్న, చండహేతివిలాసముచేత, “రవేరర్చిశ్చ శస్త్రం చ వహ్నిజ్వాలా చ హేతయః” అని అ. సరభసమౌనట్లుగా, గ్రస్త = మ్రింగఁబడిన, విద్వేషిధామౌఘుఁ డగుచు = శత్రుప్రతాపసమూహము గలవాఁ డగుచు, విపక్షయూధపుని = సుశర్మను, పట్టి = పట్టుకొని, కలంక పెంపెల్ల డీల్పఱిచెనని క్రిందటి కన్వయము.

క.

ఈగతి దక్షిణదిశయం, దాగోగ్రహదుష్టచేష్టు నధిపప్రమదై
కాగారికునిర్ధామునిఁ, గా గర్వమడంచి విడిచె గాడ్పుకొడుకొగిన్.

83

భారత. ఈగతిని = ఈప్రకారమున, దక్షిణదిశయందు, ఆగోగ్రహదుష్టచేష్టుని = ఆదక్షిణగోగ్రహణము చేసినసుశర్మను, అధిప = ఏలికయైన విరటునియొక్క, ప్రమదమునకు, ఐకాగారికుని = చోరుఁడయినవాని, "చోరైకాగారికస్తేనదస్యుతస్కరమోషకాః” అని అ. నిర్ధామునిఁగా = నిస్తేజస్కునిఁగా, గర్వమడంచి విడిచెను, గాడ్పుకొడుకు = భీముఁడు.

రామ. ఈగతి, దక్షిణదిశయందు = అన్నిదిక్కులను గపులు వెదకఁబోయినారు గనుక నందులో దక్షిణపుదిక్కునం దనుట, ఆగః = పాపమనెడి, గ్రహ = భూతావేశముచేత, దుష్టమైన చేష్టగలవాని, అధిప = రామునియొక్క, ప్రమదకు = సీతకు, “ప్రమదా భామినీ కాంతా" అని అ. ఐకాగారికుని చోరుఁడైనవాని, సీత నపహరించినవాని ననుట, నిర్ధామునిఁగా = గృహరహితునిఁగా, లంకను గాల్చెఁ గనుక, గర్వమడంచి విడిచెను, గాడ్పుకొడుకు = హనుమంతుఁడు.

తే.

ఇట్లు రిపుభయంకరబలోదీర్ణుఁ డగుచు
నవనిజశుభప్రవృత్తి మానవవిభునకుఁ
బరమసంతోష మొనరింప మరలెఁ బురికి
హర్ష మొదవంగ సప్రభుం డగుచు నతఁడు.

34

రామ. అవనిజ = సీతయొక్క, శుభప్రవృత్తిని = శుభవార్తచేత, పురికి = లంకకు, హర్ష మొదవంగన్ = తిరిగిపోఁగంటిఁగా నని సంతోషము రాఁగా, సప్రభుం డగుచు = ప్రభాసహితుఁడై, మరలెను = క్రియ.

భారత. నవమైన, నిజ = తనయొక్క, శుభప్రవృత్తి = శుభప్రవర్తనము, వంటలు గాక యుద్ధమును జేయుననుట వింత యనఁగా, సప్రభుం డగుచు = ప్రభువుతోఁ గూడుకొని, పురికి మరలెను.

వ.

అట్టిసమయంబున.

35