రామ. సర్వపూజ్యయై, నిజాజ్ఞ = తనయాజ్ఞ, జరుగ, ఆతనిన్ = హనుమంతుని, జటాయుర్విఘాతి = రావణుఁడు, అమరణ = మరణరహితమైన, క్రియా = ప్రయోజనమందుఁగల, చంపుటతక్క యేదైన నొకదండన చేయుటయం దనుట, ఉత్కతా = ఉత్సుకత్వమే, సహాయుఁడై = ఔత్సుక్యముతోఁ గూడినవాఁడనుట, తత్ = ఆ, విపక్షమృత్యు = విపక్షులకు మృత్యువయిన హనుమంతుని యొక్కవాలము - తోఁకను, శుష్మ = అగ్నిచేత, “బర్హి శ్ముష్ణా కృష్ణవర్మా” అని అ. దీపితముగఁ జేసి విడిపించెను.
| సీ. | మహితధర్మనియమ మాహాత్మ్యభూతన | |
| ఆ. | సత్యనల్పదర్ప మమరవిపక్షయూ | 32 |
రామ. మాహాత్మ్యముగల, భూతనయా = సీతయొక్క, అనుగ్రహముచేత, అభిగుప్త = రక్షింపఁబడిన, అంగముగలవాఁడౌచు, వాయుసుతుఁడు = హనుమంతుఁడు, ఇలకు = భూమికి, దొరకునట్లుగా, నిశ్చలజయవైభవోదయముగల, మహా, వాలహస్త = పుచ్ఛమందున్న, "వాలహస్తశ్చ వాలధిః” అని అ. చండహేతివిలాస = తీవ్రాగ్నిప్రకాశముచేత, సరభసగ్రస్త = శీఘ్రముగా దహింపఁబడిన, సమస్తవిద్వేషులయొక్క, ధామౌఘుఁ డగుచు = గృహనమూహములు గలవాఁడౌచు, “గృహదేహత్విట్ప్రభావా ధామాని” అని అ. దర్పము = తనగర్వము, అమరవిపక్షయూధపుని = రావణుని, పట్టిని = రావణుని కుమారుఁడైన యింద్రజిత్తునును, సరకుగొనక ప్రబలఁగా, లంకపెంపు నెల్ల డీల్వఱిచెనని యన్వయము.
భారత. మహితమైన, ధర్మ = యమునియొక్క, నియమ = కట్టడయొక్క, మాహాత్మ్యమువలన, భూత = పొందఁబడిన, “భూ ప్రాప్తౌ" అని ధాతువు. నయ = నీతియొక్క, అనుగ్రహ = ఆనుకూల్యముచేత, అభిగుప్త = డాఁపఁబడిన, అంగముగలవాఁడౌచు, వాయుసుతుఁడు = భీముఁడు, అంతనిలక = ఆవిరటుని విడిపించినమాత్రాననే నిలుపక,